హీరో మాస్ట్రో ఎడ్జ్ 125.. ఈ స్కూటర్ లో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హీరో కనెక్ట్ యాప్‌తో, స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా జత చేయవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, పార్కింగ్ లొకేషన్, టో ఎవే నోటిఫికేషన్, సమగ్ర రైడింగ్ రిపోర్ట్‌ను అందిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, పూర్తి డిజిటల్ కన్సోల్‌తో వస్తోంది. ఇది నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అన్నింట్లోనూ డ్రమ్ బ్రేక్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 77,896 నుంచి ప్రారంభమవుతాయి. అదే డిస్క్ బ్రేక్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ స్కూటర్ ధర రూ. 82,346, డిస్క్ బ్రేక్, ప్రిస్మాటిక్ కలర్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ ధర రూ. 82,766గా ఉంది. అదే బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్కూటర్ అయితే రూ. 86,000 ఉంటుంది.