
హీరో స్ప్లెండర్ ప్లస్.. ఇతర మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ స్ప్లెండర్ ఇప్పటి వరకు భారతదేశంలో బెస్ట్ సెల్లర్ ద్విచక్ర వాహనంగా కొనసాగుతోంది. స్ప్లెండర్ సిరీస్ అనేక మోడళ్లను కలిగి ఉంది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. హీరో స్ప్లెండర్ ప్లస్‌లో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 7.91 బిహెచ్‌పి పీక్ పవర్ , 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 75,141 నుంచి రూ. 77,986 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

హోండా ఎస్పీ 125.. ఈ బైక్ ధర రూ. 86,017 నుంచి 90,017 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 123.94 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 10.72 బీహెచ్పీ గరిష్ట శక్తి, 10.9 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. ఇది భారతదేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్‌లలో కూడా ప్రజాదరణ పొందింది. ఇది తొమ్మిది శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని చెప్పుకునే i3S టెక్నాలజీని పొందుతుంది. దీనిలో 97.2 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. ఈ ఇంజన్ 7.91 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 59,998 నుంచి 68,768 (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

హోండా షైన్ 125.. ఇటీవల కాలంలో ఎక్కువశాతం మంది 100సీసీ కన్నా కూడా 125సీసీ బైక్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. హోండా దీనిపై ఫోకస్ పెట్టి 125సీసీ బైక్స్ ను ఎక్కువగా లాంచ్ చేస్తోంది. దీనిలో ప్రధానంగా షైన్ 125కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర రూ. 79,800 నుంచి 83,800 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీనిలో 123.94సీసీ ఇంజన్, 10.59 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 11 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో గ్లామర్.. హీరో గ్లామర్ అనేది హీరో మోటోకార్ప్ నుంచి హోండా షైన్ 125,హోండా ఎస్పీ 125 లకు పోటీగా తీసుకొచ్చిన బైక్. దీని ధర రూ.80,908 నుంచి 86,348 (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది . ఈ మోటార్‌సైకిల్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ ఛార్జర్, 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ను పొందుతుంది. ఈ బైక్ లో 124.7 సీసీ ఇంజిన్ 10.39 బీహెచ్పీ గరిష్ట శక్తి, 10.4ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది.