
Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను విడుదల సమయం రానే వచ్చేసింది. రేపు అంటే మార్చి 22వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రబీ సీజన్‌కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. దీంతో ఆదివారం రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు.

రైతుల కోసం పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున (రెండు దఫాల్లో) పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుంది.

అలాగే 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడవ విడత నిధులు రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో 'రైతు భరోసా'ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.