Mukesh Ambani: అంబానీ లైఫ్‌స్టైల్‌లో ఓ కీలక విషయాన్ని వెల్లడించిన కుమారుడు ఆకాశ్

Updated on: Feb 28, 2026 | 8:49 AM

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ.. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. అయితే అంబానీ గురించి ఏది చెప్పిని అది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా ఆయన లైఫ్ స్టైల్‌ గురించి కొడుక ఆకాశ్‌ అంబానీ కీలక విషయాన్ని వెల్లడించారు.

1 / 5
 Mukesh Ambani: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ లైఫ్‌ స్టైల్‌ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఆయన దిచ చర్య ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ను ఆయన విజయ రహస్యం ఏమిటని అడిగినప్పుడల్లా ఆయన తన లక్ష్యానికి కట్టుబడి ఉండటం గురించి మాట్లాడుతారు. జరగని విషయాల గురించి ఆలోచించే బదులు భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన నమ్ముతారు. అందుకే 68 సంవత్సరాల వయస్సులో ఆయన కోట్లాది మంది యువతకు ఒక ఆదర్శం.

2 / 5
 మీరు కూడా ముఖేష్ అంబానీ లాగా విజయం సాధించడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జీవితంలో ముందుకు సాగడానికి తన తండ్రే అతిపెద్ద ప్రేరణ అని ఆకాష్ చెప్పాడు. ఆయన తన కుటుంబంతో పాటు తన పనిని కూడా సరైన రీతిలో నిర్వహిస్తారని తెలిపారు.

3 / 5
 ముఖేష్ అంబానీ రాత్రి 2 గంటల వరకు నిద్రపోరని ఆకాష్ అంబానీ చెప్పారు. గత 40 సంవత్సరాలుగా ప్రతి మెయిల్‌ను స్వయంగా చదివి స్వయంగా రిప్లై  ఇస్తారని, ఈ అలవాటు కొన్నిసార్లు అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఇంత వయసు వచ్చినప్పటికీ తన జీమెయిల్‌కు వచ్చిన మెయిల్స్‌ అన్ని కూడా చదివి సమాధానం ఇవ్వనిదే నిద్రపోరని అన్నారు. అతని షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయినా తన పని పూర్తి చేసే వరకు నిద్రపోరని అన్నారు.

4 / 5
 ఈ సమయంలో ఆకాష్ అంబానీ తన తల్లి నీతా అంబానీ గురించి కూడా ప్రస్తావించారు. తన తల్లి గురించి ఎంతో ప్రశంసించారు. ఆమె పని పట్ల ఎంతో మక్కువ చూపిస్తారని, వ్యాపారం అయినా, క్రికెట్ అయినా ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు.

5 / 5
 మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా అమ్మ ప్రతిదీ గమనిస్తారన్నారు. తల్లిదండ్రులు పనికి అంకితభావంతో ఉన్న విధానం పిల్లలు పని చేయడానికి కూడా ప్రేరణనిస్తుందన్నారు.

Follow Us