
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకింగ్ న్యూస్. ఎస్బీఐ కార్డ్ తమ కస్టమర్లకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్‌పే ఎస్బీఐ కార్డుల్లో మార్పులు చేసింది. రివార్డ్ పాయింట్స్ పొందే విధానంలో సవరణలకు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రివార్డ్ పాయింట్స్‌కు పరిమితులు విధించడంతో పాటు మరికొన్ని కార్డులకు వీటిని పూర్తిగా తొలగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే

ఫోన్‌పేతో భాగస్వామ్యంతో ఎస్బీఐ కొన్ని క్రెడిట్ కార్డులను జారీ చేస్తోంది. వీటిల్లో ఎస్బీఐ ఫోన్‌పే పర్పుల్, ఫోన్‌పే సెలక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డులకు సంబంధించి రివార్డ్ పాయింట్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో నెలవారీ ఆన్‌లైన్ ఖర్చులపై వెయ్యి రివార్డ్ పాయింట్స్ ఎస్బీఐ పర్పుల్ కార్డు వినియోగదారులకు ఇచ్చేవారు. ఇక ఫోన్‌పేలో చేసే స్పెండింగ్స్‌పై మరో వెయ్యి వచ్చేవి.

కానీ ఇప్పుడు రివార్డ్ పాయింట్లలో కోత విధించారు. ఫోన్‌పేలో ఇన్యూరెన్స్ రిలేటెడ్ ఖర్చులకు 250, ఇతర లావాదేవీలకు 750 పాయింట్ల వరకు ఇవ్వనున్నారు. ఇక ఆన్ లైన్‌లో చేసే ఖర్చులపై రివార్డ్ పాయింట్లను వెయ్యి నుంచి 750కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ కార్డ్ స్పష్టం చేసింది.

ఇక ఫోన్‌పే ఎస్బీఐ సెలక్ట్ బ్లాక్ కార్డు వాడేవారికి కూడా రివార్డ్ పాయింట్లలో కోత విధింపు జరిగింది. గతంలో ఫోన్‌పేలో చేసే ఖర్చులపై 2 వేల రికార్డ్ పాయింట్స్ అందేవి. ఇప్పుడు ఆన్‌లైన్ ఖర్చులపై వెయ్యి పాయింట్లు ఇవ్వనుండగా.. ఫోన్‌పేలో ఇన్యూరెన్స్ స్పెండింగ్స్‌పై 500 పాయింట్లు, ఇతర ఖర్చులపై 1500 పాయింట్లు ఇవ్వనున్నారు

ఇక కొన్నింటికి చేసే ఖర్చులకు రివార్డ్ పాయింట్లు తగ్గించారు. టోల్ అండ్ బ్రిడ్జ్ పేమెంట్స్, గిఫ్ట్ అండ్ సావనీర్, జువెలరీ, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, ఫోన్ పే బయట చేసే యుటిలిటీ, ఇన్యూరెన్స్, యూపీఐ లావాదేవీలకు రికార్డ్ పాయింట్స్ రావు. గతంలో ఉన్న రివార్డ్ పాయింట్లలో కోత విధించడంతో ఈ కేటగిరీ కార్డులు వాడేవారికి నిరాశ ఎదురైనట్లయింది. ఈ కొత్త రూల్స్‌పై కార్డులు ఉపయోగించేవారికి మెస్సేజులు పంపుతోంది.