Bullet 350 Next Gen: బుల్లెట్ లవర్స్‌కి శుభవార్త.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి దూసుకొస్తున్న ‘నెక్స్ట్ జన్’ మోడల్.. పూర్తి వివరాలివే..

| Edited By: Ravi Kiran

Aug 02, 2023 | 1:48 PM

Royals Enfield's Bullet 350 Next Gen: ఎంతటి ట్రెండీ బైక్ అయినా బుల్లెట్ ముందు దిగదుడుపే అన్నట్లుగా భావిస్తుంటారు కొందరు. అలాంటివారి కోసమే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి అద్దిరిపోయే శుభవార్త. అదేమిటంటే... రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ‘న్యూ జనరేషన్ బుల్లెట్ 350’ కొత్త వెర్షన్ మోడల్‌ని ఈ ఆగస్టులోనే విడుదల చేయబోతోంది. బుల్లెట్ 250 నెక్స్ట్ జనరేషన్ .. 346 cc UCE ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇందులో కొత్త J సిరీస్ ఇంజన్, 349 cc సింగిల్ సిలిండర్..

1 / 5
Royals Enfield's Bullet 350 Next Gen: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ ఆగస్టు 30 మార్కెట్‌లోకి రానుంది. 1932 నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న బుల్లెట్ 350.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి చెందిన పురాతన మోడల్.

2 / 5
డిజైన్: బుల్లెట్ 350  నెక్స్ట్ జనరేషన్ మోడల్‌కి చెందిన ఫోటోలు అధికారిక లాంచ్ కంటే ముందే లీక్ అయ్యాయి. వాటిని చూస్తే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది.

3 / 5
కొత్తగా ఏమున్నాయంటే..: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350లో ఉన్నట్లుగానే.. బుల్లెట్ 350‌ నెక్స్ట్ జనరేషన్లో కూడా టైల్‌లైట్, క్రోమ్ బెజెల్‌తో కూడిన ఫ్లాట్ రౌండ్ హెడ్‌ల్యాంప్‌ ఉండవచ్చు.

4 / 5
ఇంజిన్: బుల్లెట్ 250 నెక్స్ట్ జనరేషన్ .. 346 cc UCE ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇందులో కొత్త J సిరీస్ ఇంజన్, 349 cc సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటాయి.

5 / 5
ధర: రాయల్ ఎన్‌ఫీల్డ్ నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ మోడల్ ధర రూ. 1 లక్షా 70 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 1 లక్షా 90 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల అంచనా.