Renault Rafale SUV: రాఫెల్ వేగంతో దూసుకొస్తున్న కొత్త ఎస్‌యూవీ.. కార్ డిజైన్, ఫీచర్ల పూర్తి వివరాలివే..

|

Jun 19, 2023 | 6:07 PM

Renault Rafale Coupe SUV: రెనాల్ట్ రాఫెల్ తన కొత్త కూపే ఎస్‌యూవీ మోడల్‌తో మరోసారి కస్టమర్ల ఆదరణను పొందడానికి సిద్ధమవుతోంది. 1934 నాటి ప్రసిద్ధ Caudron-Renault Rafale విమానం జ్ఞాపకార్థం ఈ ఎస్‌యూవీని నిర్మించడం దీని ప్రత్యేకత. అసలు ఈ కారులో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ రాఫెల్ తన కూపే-ఎస్‌యూవీని పరిచయం చేసింది. కొత్త ఎస్‌యూవీ వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్‌లో విడుదల కానున్నట్లు సమాచరం. ఈ ఎస్‌యూవీ కారులోని అగ్రెసివ్ డిజైన్, టెక్ ఫీచర్లు సహా క్యాబిన్‌ ఎలా ఉంటుందో రివీల్ అయ్యాయి.

2 / 5
రెనాల్ట్ రాఫెల్ కంపెనీ 1934లో ప్రముఖ కాడ్రాన్-రెనాల్ట్ రాఫెల్ విమానాలను తీసుకువచ్చింది. రికార్డు స్థాయిలో గంటకు 445కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ విమానం జ్ఞాపకార్థం రెనాల్ట్ తన కొత్త కారును రూపొందించింది.

3 / 5
రాఫెల్ కారులో హైబ్రిడ్ ఇంజన్ పవర్ ఉంది. ఇంకా హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు ఫుల్ ట్యాంక్‌‌కి దాదాపు 1,100 కి.మీ మైలేజీ ఇస్తుందని దాని కంపెనీ పేర్కొంది.

4 / 5
5 సీటర్‌గా వస్తున్న ఈ కారులో పనోరమిక్ గ్లాస్ రూఫ్, 9.3 అంగుళాల హెడ్ అప్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి పలు ఫీచర్లు వచ్చాయి. ఈ కారు 1.2లీటర్ టర్బోచార్జ్డ్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ శక్తిని కూడా కలిగి ఉంది.

5 / 5
స్లోపింగ్ రూఫ్‌లైన్, లాంగ్ బానెట్, బ్లాక్ గ్రిల్, వైడ్ ఎయిర్ వెంట్స్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు వంటి ఫీచర్లు కూడా రెనాల్ట్ రాఫెల్‌ కూపే ఎస్‌యూవీలో ఉండనున్నాయి. ఇవే కాకుండా బ్లాక్ పిల్లర్లు, ORVMs, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్టైలిష్ ఏరోడైనమిక్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ ల్యాంప్స్ వంటి పలు రకాల  అత్యాధునిక ఫీచర్లు సైతం ఉన్నాయి.