
దేశంలో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో నగదుకు భద్రత ఉండటంతో పాటు సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి సులువుగా సేవలు పొందవచ్చు. పోస్టాఫీసుల్లో అనేక పొదుపు పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది. వృద్దులు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు, వృద్దుల కోసం ప్రత్యేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిల్లో పెట్టే పెట్టుబడులకు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది.

అలాగే పోస్టాఫీస్ స్కీముల్లో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మీరు పెట్టేబడులు సురక్షితంగా ఉంటాయి. అయితే పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న స్కీముల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) కూడా ఒకటి. చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి స్కీమ్. రూ.500 నుంచి ఎంత అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు.

ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ప్రతీ ఏడాది వార్షిక వడ్డీ పొందవచ్చు. అయితే పీపీఎఫ్ అకౌంట్‌కు 15 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అనంతరం వడ్డీతో సహా మీరు వెనక్కి తీసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఎలాంటి రిస్క్ లేని స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. అంతేకాకుకండా మీ డబ్బుకు ఎలాంటి పన్ను అనేది ఉండదు.

ఇక వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ట్యాక్స్ అనేది ఉండదు. ఇక 15 ఏళ్ల తర్వాత మీరు అందుకునే మొత్తం బ్యాలెన్స్‌పై కూడా వడ్డీ అనేది పడదు. ఈ పథకంలో ఏడాదికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. ఇందులో మీరు ప్రతీ నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే 15 ఏళ్లల్లో రూ.22.5 లక్షలు పొందవచ్చు.

నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 15 ఏళ్లకు రూ.22.5 లక్షలు అవుతాయి. 7.1 శాతం వార్షిక వడ్డీ ప్రకారం లెక్కిస్తే 15 ఏళ్లకు రూ.18.18 లక్షల వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం మీకు రూ.40.68 లక్షలు అందుతాయి. ఇక మీరు మధ్యలో అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. ఒక ఏడాది తర్వాత రుణం పొందవచ్చు. అలాగే ఐదేళ్ల తర్వాత అవసరమైతే కొంత మొత్తం విత్ డ్రా కూడా చేసుకోవచ్చు.