
Ola Offer: మీరు పెట్రోల్ ధరల సెగతో విసిగిపోయారా? బైక్ తీయాలంటేనే జేబు ఖాళీ అవుతుందని భయపడుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త! ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెట్రోల్ వాహనాలకు కాలం చెల్లిందని చాటిచెబుతూ ఎండ్ ఐస్ ఏజ్' (#EndICEAge) పేరుతో ఓలా ఒక భారీ విప్లవాన్ని మొదలుపెట్టింది. సామాన్యుల కలను నిజం చేస్తూ కేవలం రూ.49,999 కే ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తోంది.

ఏమిటి ఈ 'గోల్డెన్ ఛాన్స్'?: నివేదిక ప్రకారం.. ఓలా తన కొత్త జెన్ 3 ఎస్1 ఎక్స్ (Gen 3 S1 X), రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) మోడళ్లను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి తెచ్చింది. 50 వేల లోపు ధరతో ఇవి అందుబాటులో ఉండటం విశేషం. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే దీనిపై భారీ ప్రయోజనాలు ఉన్నాయి. పాత పెట్రోల్ బైక్ నుండి ఎలక్ట్రిక్ వాహనానికి మారే వారికి సుమారు రూ.50,000 వరకు ప్రయోజనాలను కంపెనీ కల్పిస్తోంది.

నమ్మకమైన సర్వీస్ - 'సేమ్ డే' గ్యారెంటీ: తక్కువ ధరకే వాహనాలను ఇవ్వడమే కాకుండా, కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఓలా ప్రత్యేక హామీలను ఇస్తోంది. వాహనంలో ఏదైనా సమస్య వస్తే అదే రోజు (Same Day) పరిష్కరిస్తామని ఓలా భరోసా ఇస్తోంది. ఒకవేళ సర్వీస్ సెంటర్లో పని ఆలస్యమైతే, కస్టమర్ల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఓలా క్యాబ్ వోచర్లు అందజేస్తారు. ఇక వాహనాన్ని తిరిగి కంపెనీకి అమ్మాలనుకున్నప్పుడు 60 శాతం వరకు బైబ్యాక్ విలువను ఇస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం చాలా సులభం.

ఎనిమిదేళ్ల వారంటీ: సాధారణంగా ఏ కంపెనీ ఇవ్వని విధంగా ఓలా తన వాహనాలపై ఏకంగా 8 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీని (Extended Warranty) అందిస్తోంది. సుదీర్ఘ వారంటీ వల్ల బ్యాటరీ లేదా మోటార్ ఖర్చుల గురించి ఎనిమిదేళ్ల పాటు కస్టమర్లు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనిపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతీయులు ధైర్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేయడానికి ఈ సర్వీస్ ట్రస్ట్, బైబ్యాక్ గ్యారెంటీ ఎంతో దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నారు. కంపెనీలు కూడా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఫీచర్స్‌తో ఎక్కువ దూరం రేంజ్ ఇచ్చే స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది ఓలా.