Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పెద్ద ఊరట.. ఫిజికల్ కార్డు అవసరం లేకుండానే ఈజీగా వెరిఫికేషన్..

Updated on: Apr 28, 2026 | 4:27 PM

ఆధార్ కార్డు ఉన్నవారికి ఊరట. ఇక నుంచి ఫిజికల్ కార్డు మీ వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆధార్ అవసరమైతే డిజిటల్ రూపంలో చూపించవచ్చు. ఇందుకోసం గూగుల్ వ్యాలెట్‌లో మీ ఆధార్ సేవ్ చేసుకోవచ్చు. యూఐడీఏఐతో గూగుల్ కీలక ఒప్పందం కుదర్చుకుంది.

1 / 5
ఆధార్ కార్డు ఉన్నవారికి మరో ఊరట. ఈ డాక్యుమెంట్ ఎక్కడ, ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. దీంతో ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాల్సి వస్తుంది.  హోటల్ చెకింగ్, గేటెడ్ కమ్యూనిటీలో యాక్సెస్, ప్రయాణ సమయంలో ధృవీకరణతో పాటు అనేక సేవలకు నిత్యం మనకు అవసరం పడుతుంది. అయితే కొన్నిసార్లు ఆధార్ మన వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటాం. ఇలాంటి సమయంలో ఆధార్ అత్యవసరంగా అసరమైతే ఇబ్బంది పడాల్సిన పనే లేదు.

2 / 5
ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండా ఫోన్‌లోనే ఆధార్‌ అవసరమైన చోట ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గూగుల్ వ్యాలెట్‌లో మీరు ఆధార్ సేవ్ చేసుకోవచ్చు. ఆధార్ డిజిటల్ వెర్షన్‌ను మీరు వ్యాలెట్‌లో పెట్టుకోవచ్చు. దీని వల్ల ఎక్కడైనా ఆధార్ అవసరమైతే వెంటనే చూపించవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ధృవీకరణ కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.

3 / 5
భారతదేశంలోని వినియోగదారులు అందరూ గూగుల్ వ్యాలెట్ ద్వారా ఆధార్ సేవ్ చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. రోజువారీ సేవలకు గుర్తింపు తనిఖీలను సులభతరం చేయడమే దీని లక్ష్యమని తెలిపారు. ఇందులో సెలక్టివ్ డిస్క్లోజర్ అనే ఫీచర్ ఉంటుంది. దీని వల్ల అవసరమైన వివరాలను మాత్రమే పంచుకోవచ్చు. వయస్సు ధృవీకరణ అవసరమైన చోట కేవలం దానిని మాత్రమే పంచుకోవచ్చు.

4 / 5
సినిమాలకు వయస్సు ధృవీకరణ, రివార్డుల సమయంలో వ్యాలెట్ ఆధార్‌ను ఉపయోగించవచ్చు. ఇక  భారత్ మ్యాట్రిమోనీలో ప్రైమ్ ప్రొఫైల్‌కు ధృవీకరణకు, అంతర్జాతీయ వీసా అప్లికేషన్ల కోసం ఒకే ట్యాప్‌తో సమాచారం ఆటో ఫిల్ చేసేందుకు, డెలివరీ, సర్వీస్ సిబ్బంది ధృవీకరణకు వాడుకోవచ్చు. ఇక మైగేట్, స్నాబిట్‌లో కూడా త్వరలో ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి రానుంది.

5 / 5
గూగుల్  వ్యాలెట్‌లో ఆధార్‌ను సేవ్ చేసుకోవాలంటే.. ముందుగా వ్యాలెట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత +అనే ఆప్షన్ ఎంచుకుని మోనూలో ఐడీ పాస్ లేదా ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆధార్ యాప్‌లో షేర్ ఐడీ ఫీచర్ ద్వారా గూగుల్ వ్యాలెట్‌లో ఆధార్ వివరాలు సేవ్ చేసుకోవచ్చు.

Follow Us