Motorola One 5G UW Ace: మోటోరోలా నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!

| Edited By: Subhash Goud

Jul 10, 2021 | 2:30 PM

Motorola One 5G UW Ace: మోటోరోలా కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. మోటోరోలా వన్​5జీ యూడబ్ల్యూ ఏస్​ (One 5G UW Ace) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇంటర్నెట్..

1 / 4
Motorola One 5G UW Ace: మోటోరోలా కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. మోటోరోలా వన్​5జీ యూడబ్ల్యూ ఏస్​ (One 5G UW Ace) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇంటర్నెట్ సూపర్ స్పీడ్‌లో ఉండేందుకు ఇది 5జీ అల్ట్రా-వైడ్​బ్యాండ్​కనెక్టివిటీ సదుపాయంతో అందుబాటులోకి ఉంది. అలాగే డాల్బీఅట్మాస్, డీటీఎస్​-ఎక్స్ లాంచి వెరిజోన్ అడాప్టివ్ సౌండ్ సిస్టం ఈ మోడల్‌లో ప్రత్యేకంగా ఉంది.

2 / 4
కొత్త మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్ ఆండ్రాయిడ్ 11తో వస్తోంది. అలాగే 20:9 యాస్పెక్ట్ రేషియాతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్ మ్యాక్స్ వర్షన్ డిస్​ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్​డ్రాగన్​750జీ ఎస్​వోసీ, 4 జీబీ ర్యామ్ ఈ ఏస్ మోడల్‌లో ఉంది. వెనుక 3 కెమెరాలు.. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్​అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్​మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

3 / 4
మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్​64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుండగా.. మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజీని పెంచుకోవచ్చు. 5జీ, 4జీ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్​ వీ5.1, జీపీఎస్​/ఏ-జీపీఎస్​, యూఎస్​బీ టైప్​-సీ, 3.5ఎంఎం హెడ్​ఫోన్ జాక్ కనెక్టివీటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో ఫింగర్​ప్రింట్ సెన్సార్‌తో ఇది వస్తోంది. మరోవైపు మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్‌లో 5000 Mah బ్యాటరీ ఉండగా... 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోంది.

4 / 4
మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్​4+64 జీబీ వేరియంట్ ధర 299.99 డాలర్లు (దాదాపు రూ.22,400)గా ఉంది. వొలానిక్ గ్రే కలర్​లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వెరిజోన్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రస్తుతం అమ్మకానికి ఉంది. అయితే భారత్​లోకి దీన్ని ఎప్పుడు తీసుకొస్తారనే వివరాలను మోటోరోలా ప్రకటించలేదు.