
Rain Alert: కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు, గాలులు కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో కొన్ని సందర్భాలలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంటారు అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లో, ఎల్లో, అరెంజ్ అలర్ట్ కూడా ప్రకటిస్తుంటారు.

ఈ రకమైన వర్ష హెచ్చరికలను కేంద్ర వాతావరణ శాఖ జారీ చేస్తుంది. కానీ ఈ హెచ్చరికల అర్థం ఏమిటి? రెడ్, అరెంజ్, ఎల్లో హెచ్చరికల మధ్య తేడా ఏమిటి? ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి వెనుక ఉన్న అర్థాలు ఏమిటో తెలుసుకుందాం..

వర్ష తీవ్రత ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తుంటారు వాతవారణ శాఖ అధికారులు. ఎల్లో, అరెంజ్, రెడ్ అనే మూడు రకాల హెచ్చరికలు ఉంటాయి. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అన్నట్లు. ఈ హెచ్చరిక జారీ చేసినట్లయితే 64.5 మిమీ నుండి 111.5 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

రెడ్ అలర్ట్ అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఇది చాలా భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. అంటే రెడ్ అలర్ట్ జారీ చేసినప్పుడు జిల్లాల్లో 204.4 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ రెడ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. దీంతో అధికారులు కూడా భద్రతా కోసం చర్యలు తీసుకుంటారు.

అలాగే అదనంగా హెచ్చరిక చార్ట్ సాధారణంగా తెలుపు, అరెంజ్ రంగులను చూపుతుంది. తెలుపు రంగు చినుకులను సూచిస్తుంది. అలాగే అరెంజ్ అలర్ట్ అనేది మోస్తరు వర్షపాతాన్ని సూచిస్తుంది.