
మారుతి సుజుకి ఎర్టిగా: ఫిబ్రవరి 2025లో మారుతి సుజుకి కాంపాక్ట్ MPV ఎర్టిగా, మహీంద్రా స్కార్పియోను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన 7-సీట్ల ప్యాసింజర్ కారుగా నిలిచింది. అయినప్పటికీ దాని అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఫిబ్రవరి 2025లో 14,868 యూనిట్ల ఎర్టిగా అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో 15,519 యూనిట్లతో పోలిస్తే 4 శాతం తగ్గుదల.

మహీంద్రా స్కార్పియో: ఫిబ్రవరిలో 13,618 యూనిట్లు అమ్ముడై, మహీంద్రా స్కార్పియో ఈ జాబితాలో రెండవ అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచింది. గత ఏడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 15,051 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 15% ఎక్కువ. ఇది 10 శాతం తగ్గుదల చూసింది.

మహీంద్రా బొలెరో: మహీంద్రా బొలెరో అమ్మకాలు కూడా తగ్గాయి. ఈ కాంపాక్ట్ 7-సీటర్ కారు ఫిబ్రవరి 2025లో 8,690 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో అమ్ముడైన 10,113 యూనిట్ల నుండి 14 శాతం తగ్గుదల.

టయోటా ఇన్నోవా: టయోటా ఇన్నోవా సిరీస్‌లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు ఫిబ్రవరిలో స్థిరంగా ఉన్నాయి. మొత్తం 8,449 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో 8,481 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మహీంద్రా XUV 700: గత ఫిబ్రవరిలో మహీంద్రా XUV 700 అమ్మకాలు భారీగా పెరిగాయి. మహీంద్రా నుండి వచ్చిన ఈ అద్భుతమైన 7-సీటర్ SUV అమ్మకాలు 14 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2025లో 7,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో 6,546 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టయోటా ఫార్చ్యూనర్: టయోటా శక్తివంతమైన SUV ఫార్చ్యూనర్ అమ్మకాలు ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 2025లో 2,876 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో అమ్ముడైన 3,395 యూనిట్లతో పోలిస్తే 15 శాతం తగ్గుదల.