
ఆదివారం తగ్గిన బంగారం ధరలు.. సోమవారం ఒక్కసారిగా షాకిచ్చాయి. మరోసారి ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ అధికారులు దీనిని ధృవీకరించిన క్రమంలో బంగారం ధరల్లో ఒడిడొడుకులు నమోదవుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తల క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. సోమవారం ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,51,530గా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2450 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,900 వద్ద ఉండగా.. నేడు ఒక్కరోజే రూ.2250 పెరుగుదల నమోదు చేశాయి. ఇక హైదరాబాద్ మార్కె్ట్లో 24 క్యారెట్ల ధర రూ.1,51,530గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,900కి చేరుకుంది.

చెన్నై బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,53,490కి చేరుకోగా.. సోమవారం ఒక్కరోజే రూ.2290 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,700గా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2100 మేర పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,51,530గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,900 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,680గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,050 వద్ద కొనసాగుతోంది. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగి షాకిచ్చాయి. ఏకంగా రూ.10 వేల మేర పెరిగింది. అనంతరం సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.65 లక్షలుగా ఉంది. నిన్న ఇదే ధర రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్నటితో చూస్తే రూ.5 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో నిన్న రూ.2.70 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.2.80 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో కూడా కేజీ వెండి ధర రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతోంది.