Gold Prices: మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Updated on: Jun 24, 2026 | 10:11 AM

బంగారం ధరలు పడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు డౌన్ అవ్వడం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అయితే ఈ తగ్గుదల అనేది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

1 / 5
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూ్స్. గత రెండు రోజులుగా మళ్లీ గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలు కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో ధరలు తగ్గి భారీ ఉపశమనం కల్గిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడే కొని పెట్టుకుందామనే ఆలోచనకు వస్తున్నారు. బుధవారం ధరలు డౌన్ అవ్వగా.. అనంతరం ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయనేది చూద్దాం.

2 / 5
దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా.. ఇవాళ రూ.270 మేర డౌన్ అయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు ఇప్పుడు రూ.1,32,300 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజు రూ.250 క్రాష్ అయ్యయి. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,330గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300గా ఉంది.

3 / 5
విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,920 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,590గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,330 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300గా ఉన్నాయి.

4 / 5
అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,44,480గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,49,900గా ఉంది.  చెన్నైలో రూ.2,49,900గా ఉంది.

5 / 5
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న క్రమంలో గోల్డ్ రేట్లపై వాటి ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. యుద్దం ముగిసిపోవడంతో యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వాటిల్లోకి పెట్టుబడులు వెళ్లడంతో గోల్డ్‌క డిమాండ్ తగ్గింది.

Follow Us