
కొన్నిసార్లు మనం ఆశ్చర్యకరమైన వార్తలను వింటాము. రైలులో లేదా విమానంలో శిశువు జన్మించినట్లు. కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు సవాలుతో కూడుకున్నవి ఉంటాయి. ఒక శిశువు విమానంలో జన్మించినట్లయితే అది కూడా అంతర్జాతీయ ప్రయాణంలో దాని పౌరసత్వం గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. ఎందుకంటే చాలా విమానయాన సంస్థలు ఈ గర్భిణీ స్త్రీలను 28 లేదా 36 వారాల తర్వాత ప్రయాణించడానికి అనుమతించవు. కొన్ని విమానయాన సంస్థలు వైద్య ధృవీకరణ పత్రంతో ప్రయాణాన్ని అనుమతిస్తాయి. కానీ విమాన ప్రయాణంలో ప్రసవం అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

ఒక బిడ్డ విమానంలో జన్మించినట్లయితే, ఆ బిడ్డ పౌరసత్వం ఆ సమయంలో విమానం ఎక్కడ ఉంది. విమానం ఏ దేశంలో నమోదు చేయబడింది.. తల్లిదండ్రుల జాతీయత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రపంచంలోని చాలా దేశాలు ఈ నియమాన్ని అనుసరిస్తాయి. తల్లిదండ్రుల పౌరసత్వం ఆధారంగా పిల్లల పౌరసత్వాన్ని వారు నిర్ణయిస్తారు. భారతదేశంలో కూడా ఇలాంటి నియమం ఉంది. విదేశాలలో విమానంలో జన్మించిన బిడ్డ తల్లిదండ్రులలో ఒకరు భారతీయుడైతే ఆ బిడ్డ ఏ దేశంలో జన్మించాడనే దానితో సంబంధం లేకుండా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.

ఇప్పుడు అంతర్జాతీయ చట్టం గురించి తెలుసుకుందాం. ఒక బిడ్డ ఒక దేశ గగనతలంలో జన్మిస్తే ఆ దేశం తన చట్టాల ప్రకారం ఆ బిడ్డకు పౌరసత్వం ఇవ్వవచ్చు. ఉదాహరణకు, అమెరికా తన గగనతలంలో జన్మించిన పిల్లలకు అమెరికన్ పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది.

ఏదైనా దేశ సరిహద్దుల్లో లేని ప్రాంతంలో లేదా భూభాగంలో (ఉదాహరణకు సముద్రంలో) ఒక బిడ్డ జన్మించినట్లయితే ఆ బిడ్డ పౌరసత్వాన్ని నిర్ణయించడం కొంచెం కష్టమవుతుంది. అయితే అలాంటి సందర్భాలలో విమానం నమోదు చేయబడిన దేశాన్ని సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు (పౌరసత్వ ప్రయోజనాల కోసం).