నేడు దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్ జారీ.. ఇలా ప్లాన్ చేస్కోండి..

Updated on: Nov 03, 2026 | 9:13 AM

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ బ్యాంక్ ఉద్యోగులు నవంబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఈ కారణంతో ఆ బ్యాంకుల్లో ఇవాళ కార్యకలాపాలన్నీ నిలిచిపోనున్నాయి. దీంతో కస్టమర్లకు ఐడీబీఐ బ్యాంక్ అలర్ట్ జారీ చేసింది. ఖాతాదారులకు ప్రత్యామ్నాయ సూచనలు చేసింది.

1 / 5
బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఐడీబీఐ బ్యాంకులు ఇవాళ మూతపడనున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆ బ్యాంక్ ఉద్యోగులు నవంబర్ 2వ తేదీ నుంచి సమ్మె చేపడుతున్నారు. నవంబర్ 3 వరకు ఈ సమ్మె దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. ఈ కారణంతో ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ కారణంతో మంగళవారం కూడా ఐడీబీఐ బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

2 / 5
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె క్రమంలో తమ కస్టమర్లకు ఐడీబీఐ అడ్వైజరీ చేసింది. ఉద్యోగుల సమ్మె క్రమంలో బ్యాంక్ సేవలకు అంతరాయం కలగడంతో పలు సూచనలు జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఐడీబీఐ కస్టమర్లు ఉచితంగా  నగదు విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నిసార్లు అయినా ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ముందస్తుగా ఈ విషయాన్ని గమనించి ట్రాన్సాక్షన్లను ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది.

3 / 5
బ్యాంక్ బ్రాంచ్ సేవలకు మాత్రమే అసౌకర్యం కలుగుతుందని, డిజిటల్ వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తాయని ఐడీబీఐ ప్రకటించింది. ఖాతాదారుల తమ డెబిట్ కార్డుల ద్వారా ఇతర బ్యాంకుల నుంచి ఎలాంటి పరిమితులు, రుసుంలు లేకుండా ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఇక మొబైల్ బ్యాంకింగ్ (Go Mobile+) యాప్‌తో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సూచించింది.

4 / 5
ఆన్‌లైన్ సేవలు 24 గంటల పాటు పనిచేస్తాయని ఐడీబీఐ ప్రకటించింది. ఇక గ్రామీణ, సెమీ అర్బన్ వంటి ప్రాంతాల్లో బీఎన్ఏ మిషన్ల ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉందని గుర్తు చేసింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీకి 60.72 శాతం వాటా ఉంది. ఈ వాటాను విదేశీ సంస్థ ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థకు విక్రయించేందుకు మార్గం సుగమమైంది.

5 / 5
ఈ  ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐడీబీఐ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో దేశవ్యా్ప్తంగా ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us