
స్విచ్ సీఎస్ఆర్ 762(Svitch CSR 762).. స్పోర్ట్స్ లుక్ కలిగిన ఈ బైక్ సిటీ లిమిట్స్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఫోన్ పెట్టుకునేందుకు ప్రత్యేకమైన స్థలం ఇచ్చారు. ఫోన్ చార్జింగ్కు కూడా అవకాశం ఉంటుంది. స్విచ్ సొల్యుషన్ యాప్, జీపీఎస్, సర్వీస్ రిమైండర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 160కిలోమీటర్ల రేంజ్ ఇది ఇస్తుంది. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఒడిస్సే వేడర్(Odysse Vader).. ఈ బైక్ ను ఇటీవల కంపెనీ లాంచ్ చేసింది. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనిలో ఈవీ యాప్, బైక్ లోకేటర్, యాంటీ థెఫ్ట్, జీయో ఫెన్స్, ఇమ్మోబైలైజేషన్, ట్రాక్ అండ్ ట్రేస్, లో బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 3.7 కిలోవాట్ల సామర్థ్యంలో బ్యాటరీ ఉంటుంది. ఇది చార్జ్ అవడానికి కేవలం 4 గంటల సమయం సరిపోతోంది. గరిష్టంగా గంటకు 85కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ. 1.10లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్(Royal Enfield).. యువకుల కలల బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్లాసిక్ డిజైన్ తో వస్తుంది. ఐఎస్ఓ26262 సేఫ్టీ గైడ్ లైన్స్ అనుగుణంగా పలు ఫీచర్లను తీసుకొచ్చారు. అలాగే ఫ్లక్స్ మోటార్, 1డీ థెర్మల్ మోడల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని ధర రూ. 1.2లక్షల నుంచి రూ. 1.8లక్షల వరకూ ఉండే అవకాశం ఉంది. ఇది 2024 సెకండ్ హాఫ్లో మార్కెట్లోకి వచ్చే చాన్స్ ఉంది.

ర్యాప్టీ ఎలక్ట్రిక్ బైక్(Raptee Electric Bike).. చెన్నై బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్ కంపెనీ ర్యాప్టీ ఎనర్జీ త్వరలోనే ఓ ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం 3.5 సెకండ్లలోనే గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సున్నా నుంచి 80శాతం వరకూ కేవలం 45 నిమిషాల్లోనే చార్జ్ అవుతుంది. దీని ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ ఏఈ-47(Hero Electric AE-47).. ఇది అనువైన బడ్జెట్లో లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. దీనిలో మోబైల్ యాప్, జీపీఎస్, జీపీఆర్ఎస్, రియల్ టైం ట్రాకింగ్, క్రూయిజ్ కంట్రోల్, యూఎస్బీ చార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనిలో 3.5కిలోవాట్ల సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై ఎకో మోడ్లో 85కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పవర్ మోడ్లో 160 కిలోమీటర్ల రేంజ్ ఇది ఇస్తుంది. దీని ధర రూ. 1.25లక్షల నుంచి రూ. 1.50లక్షల వరకూ ఉంది. ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.