మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. దీనిలో కూడా 1-లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 88బీహెచ్పీ, 113ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉంది. నావిగేషన్ సిస్టమ్, నాలుగు స్పీకర్లతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా పొందుతుంది. దీని ధర రూ. 6.54 లక్షల నుంచి రూ. 7.30 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంటుంది.