Gold Rates Today: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. గంటల్లోనే భారీగా పతనం.. ఒక్కసారిగా ఎంత తగ్గాయంటే..?

Updated on: Feb 03, 2026 | 10:12 AM

బంగారం ధరలు మళ్లీ డౌన్ అయ్యాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బులియన్ మార్కెట్లో సెకన్ సెకన్‌కు ట్రేడింగ్‌లో గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం మరోసారి గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. ఈ తగ్గింపు అనంతరం వివిధ నగరాల్లో రేట్లు ఇలా..

1 / 5
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. వరుసగా కుప్పకూలుతూ వస్తోన్న గోల్డ్ రేట్లు.. మంగళవారం మరోసారి పడిపోయాయి. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తోన్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు వేలల్లో తగ్గుతూ వస్తోండగా.. మంగళవారం గంటల వ్యవధిలోనే మరోసారి గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి.

2 / 5
బంగారం ధరలు మంగళవారం రూ.1500 మేర తగ్గగా.. సిల్వర్ ధర రూ.20 వేలు తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,51,750గా ఉంది. సోమవారం ఈ ధర రూ.1,53,170 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.1420 తగ్గుముఖం పట్టింది. ఇక నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,100 వద్ద ఇప్పుడు కొనసాగుతోంది.

3 / 5
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారంపై నిన్నటితో పోలిస్తే నేడు రూ.1300 తగ్గింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి. అయితే రాష్ట్రాలు విధించే ట్యాక్స్‌లను బట్టి వేర్వేరు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. దీంతో చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో గోల్డ్ రేట్లలో స్వల్ప తేడా ఉన్నాయి.

4 / 5
ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,060గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,300 వద్ద కొససాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రూ.1,51,750 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,100గా ఉంది. అటు ఢిల్లీలో కూడా బంగారం ధర రూ.1420 తగ్గింది.

5 / 5
ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.3 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే మంగళవారం కేజీ వెండిపై రూ.20 తగ్గింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులో కూడా కేజీ వెండి రూ.2.80 లక్షలుగా కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us