
Gold, Silver Price: మళ్లీ బంగారం, వెండి ధరలు నమ్మించి దెబ్బకొట్టాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే బంగారం, వెండి ధరలు ప్రతి రోజు ఉదయం 9-10 గంటల సమయంలో అప్‌డేట్ అవుతుంటాయి. దీంతో ఇప్పుడు ధరలు భారీగా పెరిగాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2240 పెరుగగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 2050 రూపాయలు పెరిగింది.

ఇక వెండి విషయానికొస్తే కిలో సిల్వర్‌పై భారీగా పెరిగింది. ఏకంగా 15000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షల రూపాయలకు చేరుకుంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,840 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,130 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

బంగారం, వెండి రేట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది. జనవరి నెలలో ధరలు నింగిని తాకి పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించగా, ఫిబ్రవరి నెల వచ్చేసరికి నేల చూపులు చూశాయి. అయితే మళ్లీ ధరలు పెరగడం మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరను మళ్లీ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.