
Gold, Silver Price Today: మహిళలకు బంగారం, వెండిలు శుభవార్త వినిపించాయి. ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా డాలర్ విలువ తగ్గడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

నివేదికల అంచనా ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ఈ పరిస్థితి గోల్డ్, సిల్వర్ ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ టెన్షన్ పెరగడం వల్ల ప్రపంచం వినియోగించే ఆయిల్‌లో దాదాపు నాల్గవ వంతు సరఫరా అడ్డంకులు ఎదుర్కొంటోంది

తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా1090 రూపాయలు తగ్గగా, అదే 22 క్యారెట్ల10 గ్రాములపై 1000 రూపాయలు తగ్గింది.

ధరలు తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,220 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,700 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల వరకు దిగి వచ్చింది. ధర తగ్గిన తర్వాత కిలో గ్రాము ధర 3 లక్షల నుంచి 2,90,000 వరకు దిగి వచ్చింది. అలాగే ఇతర నగరాల్లో 2,80,000 వద్ద కొనసాగుతోంది. అంటే ఇతర నగరాల్లో తక్కువ ధర ఉంది.