
దీపావళి వస్తున్న వేళ బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి, ధంతేరస్ డిమాండ్ కారణంగా పసిడి ధరలు పుంజుకుంటున్నాయి. డిమాండ్ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉండటంతో పండుగ నాటికి ఇంకా ఎగబాకే ఛాన్స్ ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరల ధోరణి ఎప్పుడు ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం. నవంబర్ 3న మార్కెట్లు ప్రారంభం అయ్యాక ధరలు పెరిగాయి

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,640 వద్ద కొనసాగుతుండగా.. నేడు ఒక్కరోజే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,000 వద్ద ప్రస్తుతం ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,790గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,28,150 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.1,39,640 పలుకుతుండగా., 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,28,000గా కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

అయితే బంగారంతో పోలిస్తే వెండి ధరలు భిన్నంగా కొనసాగుతున్నాయి. నవంబర్ 3న సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.2 లక్షల వద్ద కొనసాగుతూండగా.. హైదరాబాద్‌లో కూడా రూ.2 లక్షలుగానే ఉంది. చెన్నై, బెంగళూరులో కూడా ఇలాగే ఉన్నాయి.

అమెరికా మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర ఏకంగా 3.63 శాతం పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన సెంటిమెంట్‌కు ఇది ఒఖ సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. గత మూడు వారాల్లో బంగారం ధరలపై అమ్మకాల ఒత్తిడి 6 శాతానికి పైగా నమోదైంది. ఈ కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.