
Gold, Silver Prices: బంగారం ధరలు మరోసారి భారీ షాకిచ్చాయి. గత నాలుగైదు రోజుల నుంచి క్రమంగా దిగి వస్తున్న ధరలు మంగళవారం కొన్ని గంటల్లోనే భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 820 రూపాయలు పెరుగగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 750 రూపాయల వరకు ఎగబాకింది. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

బంగారం ధరలు అటుంచితే.. వెండి మాత్రం అందుకు విరుద్దంగా ఉంటోంది. తాజాగా బంగారం ధర పెరిగితే వెండి తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయల వరకు దిగి వచ్చింది. ధర తగ్గిన తర్వాత వెండి ధర కిలో గ్రాముకు 2,85,000 రూపాయల వరకు దిగి వచ్చింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలోకు 3 లక్షల రూపాయల వరకు ఉంది.

ఇక బంగారం ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,040 ఉండగా, అదే ఉదయం 6 గంటల సమయానికి రూ.1,56,220 ఉంది. అదే 22 క్యారెట్ల ధర తగ్గిన తర్వాత రూ.1,43,950 ఉండగా, అదే ఉదయం సమయంలో రూ.1,43,200 వద్ద ఉండేది.

ముంబై నగరంలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,57,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,43,950 పలుకుతోంది.

ఇక ఢిల్లీ విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,190 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,100 పలుకుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. మీరు కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వెళ్లడం మంచిది.