Gold Price: ఇది కదా కావాల్సింది.. 4 గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం ధర..!

Updated on: May 18, 2026 | 10:59 AM

Gold, Silver Prices: అమెరికా, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై సానుకూల సంకేతాలు లేకపోవడం వంటివి ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలను మరింత పెంచాయని గమనించాలి. ముడి చమురు, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో, డాలర్ బలపడుతూ..

1 / 5
 Gold Price: ఇది కదా కావాల్సింది.. కొన్ని గంటల్లోనే బంగారం ధర భారీగా పతనం.. మరి వెండి సంగతేంటి? Gold, Silver Prices Tody: ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతల అవకాశాలు తగ్గాయి. ఇది బంగారం, వెండి ధరలు తగ్గడానికి దారితీసింది.

2 / 5
 అయితే తాజాగా మే 18న కొన్ని గంటల్లోనే బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాములపై 710 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల తులం బంగారంపై 650 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,43,200 వద్ద కొనసాగుతోంది.

3 / 5
ఇక బంగారం ధరరలు ఇలాగుంటే.. వెండి మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా 10 వేల రూపాయల వరకు ఎగబాకింది. హైదరాబాద్‌, చెన్నై, కేరళలలో కేజీ  సిల్వర్‌ 3 లక్షల రూపాయలకు చేరుకుంది. అదే ముంబై, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో కిలో వెండి ధర 2,90,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

4 / 5
కొనుగోలు చేసేటప్పుడు, ధరలలోని హెచ్చుతగ్గులను గమనించండి. ఆభరణాలను ఎల్లప్పుడూ BIS హాల్‌మార్క్‌తోనే కొనండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో ధరలను పోల్చి చూడండి. మీరు పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేస్తుంటే, 24-క్యారెట్ గోల్డ్ ETFలు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లను కూడా పరిగణించవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో ధరలలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

5 / 5
అమెరికా, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై సానుకూల సంకేతాలు లేకపోవడం వంటివి ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలను మరింత పెంచాయని గమనించాలి. ముడి చమురు, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో, డాలర్ బలపడుతూ, బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.

Follow Us