Gold Prices: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఒకేసారి భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Updated on: Feb 01, 2026 | 10:45 AM

కేంద ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన వేళ బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. నిన్న రూ.1.60 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.1.45 లక్షలకు పడిపోయాయి. డాలర్ బలపడటంతో గోల్డ్ రేట్లు పడిపోయాయి. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే..

1 / 5
కేంద్ర బడ్జెట్ ప్రకటన వేళ దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. శనివారంతో పోలిస్తే భారీగా పతమనమయ్యాయి. బడ్జెట్ క్రమంలో స్టాక్ మార్కె్ట్లు ఒడిదోడుకులకు లోనవుతున్నాయి. దీంతో పాటు యూఎస్ డాలర్ బలపడటం, భౌగోళిక రాజకీయ పరిణామాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఫిబ్రవరి నెల తొలిరోజునే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు.

2 / 5
శనివారం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్‌(MCX)లో బంగారం ధరలు రూ.1,52,345 వద్ద స్ధిరపడగా.. ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు 10 గ్రాములపై 6 శాతం తగ్గి రూ.1,43,205కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధరలు ఇవాళ ఎంసీఎక్స్‌లో రూ.2.65 లక్షల వద్ద ప్రారంభమయ్యాయి. నిన్న రూ.2.92 లక్షల వద్ద ముగిశాయి.

3 / 5
ఇక అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4879 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. మునుపటి మార్కెట్ ముగింపుతో పోలిస్తే దాదాపు 8.25 శాతం తగ్గింది. ఇటీవల గోల్డ్, సిల్వర్ రేట్లు జీవతకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేయగా.. ఇప్పుడు మళ్లీ పతనం అవుతున్నాయి. మెటల్ స్టాక్స్ ఎంసీఎక్స్‌లో 15 శాతం వరకు క్షీణించాయి.

4 / 5
యూఎస్ డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు లాభాలను నమోదు చేసుకోవడంతో ఎంసీఎక్స్‌లో బంగారం, సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయి. 1980 తర్వాత గోల్డ్ రేట్లు 12 శాతం కంటే ఎక్కి తగ్గి ఔన్సుకు 5 వేల డాలర్ల కంటే దిగువకు పడిపోయాయి. 1980 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణతగా చెబుతున్నారు.

5 / 5
ఇక మార్కెట్లో అమ్మకాలు ఊపందుకోవడంతో వెండి ధరలు 36 కంటే ఎక్కువ పపడిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటనే పడిసి ధరలు తగ్గడానికి కారణమవుతోంది. ఈ వార్త తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి.

Follow Us