
ఇక చెన్నైలో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,39,860 వద్ద ఉంది. నిన్న ఈ ధర రూ.1,39,640 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ.220 మేర ధర తగ్గిందని చెప్పవచ్చు. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు ధర రూ.1,28,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,39,250గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,27,650 పలుకుతోంది.

బంగారం ధరలు గురువారం కూడా భారీగా పెరిగాయి. సోమవారం నుంచి గోల్డ్ ధరలు బ్రేకుల్లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం అయినా తగ్గుతాయని ఆశించిన ప్రజలకు మళ్లీ షాకే తగిలింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు అవాక్కవుతున్నారు. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అసలు ఒక్క రోజు కూడా తగ్గడం లేదు. దీంతో ఈ పెరుగుదలకు ఎప్పుడు బ్రేక్ పడుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

గురువారం హైదరాబాద్‌లో బంగారం ధర రూ.320 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రామలు 24 క్యారెట్ల ధర రూ.1,39,250గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,38,930 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,650 వద్ద కొనసాగుతోంది.

ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,250గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,650గా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఇవాళ రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,44,000 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.వెయ్యి పెరిగింది. ఇక విజయవాడలో కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉండగా..విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.