
మారుతి ఆల్టో (Maruti Alto): మారుతి ఆల్టో పై రూ.33వేల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ కారు మొత్తంపై నగదు తగ్గింపు రూ.15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000 వరకు అందిస్తోంది. మొత్తం రూ.33,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. దీని ధర రూ.3.78 లక్షల నుంచి రూ.5.43 లక్షల వరకకు ఉంది. ఈ మారుతి ఆల్టో ధర రూ.3.15 లక్షల నుంచి రూ.4.82 లక్షల వరకు ఉంది.

మారుతి సెలెరియా (Maruti Celerio): దీని ధర మొత్తంపై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం రూ.13,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని అసలు ధరర రూ.4.99 లక్షల నుంచి రూ.6.44 లక్షల వరకు ఉంది.

మారుతి ఈకో (Maruti Eeco): మారుతి ఈకో ధరపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం 23,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ.4.38 లక్షల నుంచి రూ.7.37 లక్షల వరకు ఉంది.

మారుతీ సుజుకి S-ప్రెస్సో (S-Presso): ఈ మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో ధర మొత్తంపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000, మొత్తం రూ.23,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.

మారుతీ వ్యాగన్ ఆర్ (Maruti Wagon R): దీనిపై మొత్తంపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000, ఆఫర్‌లో మొత్తం తగ్గింపు రూ.23,000 వరకు పొందవచ్చు. దీని ధర రూ.6.45 లక్షల నుంచి రూ.4.93 లక్షల వరకు ఉంది.

మారుతి స్విఫ్ట్/ డిజైన్ (Maruti Swift/Dzire): దీని ధరపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం తగ్గింపు రూ.23,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని అన్ని వేరియంట్లపై ఈ తగ్గింపు పొందవచ్చు. స్విఫ్ట్ అసలు ధర రూ.5.85 లక్షల నుంచి రూ.8.53 లక్షల వరకు ఉంది. డిజైర్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.08 లక్షల వరకు ఉంది.

మారుతి విటారా బ్రెజ్జా (Maruti Vitara Brezza): దీని ధర మొత్తంపై నగదు తగ్గింపు రూ.5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం రూ.18,000 వరకు తగ్గింపు ప్రయోజనం ఉంటుంది. దీని ధర రూ.7.62 లక్షల నుంచి రూ.11.11 లక్షల వకకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆఫర్ల ధరల్లో ఆయా రాష్ట్రాల బట్టి మారుతూ ఉంటాయి.