Flight Luggage Rules: విమానం ప్రయాణంలో ఈ వస్తువులకు నో ఎంట్రీ.. ఏయే వస్తువులు మీ వెంట తీసుకెళ్లవచ్చంటే..?

Updated on: Oct 12, 2026 | 1:10 PM

విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని వస్తువులను అధికారులు తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వరు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని వస్తువులు మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. విమాన ప్రయాణాలు చేసేవారు వీటి గురించి ముందే అవగాహన కలిగి ఉండాలి. అసలు ఏయే వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటికి అనుమతి ఉండదు? అనేది చూద్దాం.

1 / 5
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు తన వెంట తెచ్చుకున్న పవర్ బ్యాంక్‌కు మంటలు అట్టుకోవడం కలకలం రేపింది. దీంతో భద్రతా కారణాల వల్ల ఆ విమానాన్ని హైదరాబాద్‌కు అధికారులు మళ్లించారు. ఈ పరిణామాంతో కొద్దిసేపు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక ప్రశ్న తెరపైకి వచ్చింది. అసలు విమానాల్లో ఏయే వస్తువులు తీసుకెళ్లవచ్చు? ఏయే వస్తువుల తీసుకెళ్లకూడదు? అనే విషయాలు చూద్దాం.

2 / 5
హ్యాండ్ బాగుల్లో ల్యాప్ టాప్, కెమెరాలు, మొబైల్స్, టాబ్లెట్, మెడిసిన్స్, గోల్డ్, నగదు, ముఖ్యమైన పత్రాలు, 100 ఎంఎల్ కంటే తక్కువ పరిమాణం కలిగి  పర్ప్యూమ్స్, జెల్స్, లొషన్లు లాంటివి తీసుకెళ్లవచ్చు. ఇక డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కాపీని కూడా తీసుకెళ్లవచ్చు.

3 / 5
అయితే  పదునైన వస్తువులను విమానంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, చాకులు, కత్తెరలు, బాక్స్ కట్టర్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. ఇక అగ్గిపెట్టెలు, లైటర్లు, ఆటబొమ్మ తుపాకులు, 100 ఎంఎల్ కంటే ఎక్కువ పరిమాణం కలిగిన ద్రవ పదార్థాలను తీసుకెళ్లనివ్వరు. ఇక పేలుడు పదార్థాలు,  బ్లీచ్, యాసిడ్, పాదరసం లాంటి వాటితో పాటు ఎండిన కొబ్బరి కూడా తీసుకెళ్లడానికి వీలుండదు.

4 / 5
విమాన ప్రయాణం చేసేటప్పుడు పవర్ బ్యాంక్ తీసుకెళ్లవచ్చు. కానీ కొన్ని భద్రతా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకుంటే పవర్ బ్యాంక్‌లు లిథియం బ్యాటరీలతో పనిచేస్తాయి. వేడి ఎక్కువైనప్పుడు మంటలు వచ్చే అవకాశముంటుంది. దీంతో విమానంలో పవర్ బ్యాంక్ ఉపయోగానికి సంబంధించి కొన్ని రూల్స్ అమల్లో ఉన్నాయి.

5 / 5
విమానాల్లోకి కేవలం 100 Wh వరకు సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లను మాత్రమే అనుమతిస్తారు. ఆపైన సామర్థ్యం కలిగిన వాటిని తీసుకెళ్లడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పవర్ బ్యాంక్‌లను చెక్ ఇన్ బ్యాగుల్లో కాకుండా హ్యాండ్ బ్యాగ్ లేదా క్యాబిన్‌లోకి తీసుకెళ్లే బ్యాగ్‌లో మాత్రమే ఉంచుకోవాలి. ఇక వీటిని ఓవర్ హెడ్ బిన్ లేదా సీట్లపైన ఉండే లగేజ్ కంపార్ట్‌మెంట్లలో ఉంచకూడదు.

Loading...
Unable to load recommendations.
Follow Us