
Petrol Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కు చేరి వాహనదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రేట్లను తగ్గిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చీఫ్ ఎం అజిత్ కుమార్ స్పష్టం చేశారు.

Petrol Diesel price Today

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని సరైన సమయంలో తగ్గిస్తామని సీబీఐసీ చీఫ్ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు. అయితే పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 13 మేర గత ఏడాది ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.

ప్రస్తుతం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.33 ఎక్సైజ్ సుంకం కింద వసూలు చేస్తున్నారు. ఇక డీజిల్‌పై లీటర్‌కు రూ.31.80 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తున్నారు.