EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవాలా..? అంతవరకే లిమిట్..? కేంద్రం కొత్త రూల్స్..!

Updated on: Oct 13, 2026 | 11:59 AM

పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యూపీఐ విత్ డ్రా ఫీచర్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. డిసెంబర్ నుంచి తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తోంది. అయితే యూపీఐ ద్వారా ఎంతవరకు బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు..?

1 / 5
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించనుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే ఫీచర్‌ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం బ్యాంకులతో కలిసి ఈ సదుపాయాన్ని పరీక్షిస్తోండగా.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ ఫీచర్ కోసం యూఏఎన్ పోర్టల్‌ను ఉద్యోగుల యూపీఐ ఖాతాలతో అనుసంధానించనున్నారు.

2 / 5
యూఏఎన్ పోర్టల్‌ను యూపీఐ ఖాతాతో లింక్ చేయడం ద్వారా ఉద్యోగులు తమకు నచ్చినప్పుడు నగదును ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం పీఎఫ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. అధికారుల ధృవీకరణ అనంతరం అకౌంట్లో నిధులు జమ అవుతున్నాయి. ప్రస్తుతం నెఫ్ట్ ప్రక్రియ ద్వారా నిధులు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పీఎఫ్ పోర్టల్‌ను యూపీఐ ఖాతాలతో లింక్ చేయనున్నారు.

3 / 5
ఉద్యోగులు భీమ్ లేదా ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా నిధులు సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌ను యూపీఐ ఫ్లాట్‌ఫామ్‌కు అనుసంధానించేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 30 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్లు ఇక నుంచి రోజుల పాటు వెయిట్ చేయకుండా వెంటనే తమ పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు.

4 / 5
అయితే యూపీఐ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. మిగిలిన 25 శాతం కనీస బ్యాలెన్స్ కింద ఖాతాలోనే ఉంచుకోవాలి. ఉద్యోగం మానేశాక మిగిలిన 25 శాతాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ క్లెయిమ్స్‌కు ఇలాంటి నిబంధనలు మాత్రమే అమలు చేస్తుండగా.. యూపీఐ విధానానికి కూడా ఇవే రూల్స్ అమలు చేయనున్నారని సమాచారం.

5 / 5
యూపీఐ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కోట్లాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతోందని, త్వరలోనే తీసుకొస్తామని ఇటీవల కేంద్ర కార్మికశాఖ ప్రకటన కూడా చేసింది. దీంతో ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. ఇంకా దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. దీనిని ప్రవేశపెడితే పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ మరింత వేగవంతం కానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us