టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. ట్విటర్‌ను దక్కించుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె సహా మరికొంత మందిని తొలగించినట్లు వార్తాకథనాలు పేర్కొన్నాయి.
కాగా 221 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన 51 ఏళ్ల మస్క్ తన కంపెనీల్లో ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలజీతో ఇతర కంపెనీల కంటే చాలా భిన్నంగా ముందంజలో ఉన్నాయి.
మస్క్‌కి ప్రధాన ఆదాయ వనరు టెస్లాలో అతని వాటా నుంచి వస్తుంది. దీంతోపాటు127 బిలియన్ డాలర్ల విలువ స్పేస్‌ఎక్స్ కంపెనీని కూడా నడుపుతున్నాడు. దీని ద్వారా అంతరిక్షయానం చేయాలన్నది మస్క్ లక్ష్యం.
వీటితోపాటు రెండు స్టార్టప్‌లను కూడా నడుపుతున్నాడు. మైండ్ అండ్ టెక్నాలజీని కనెక్ట్ చేయడం ద్వారా న్యూరాలింక్ ఆవిష్కరణపై ఇవి పనిచేస్తున్నాయి.
అంతేకాకుండా మస్క్ బోరింగ్ కంపెనీ.. సాంకేతికతతో వేగంగా కదిలే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.
ఎలక్ట్రిక్ వాహనాలను తయారీలో టెస్లా అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 650 బిలియన్ డాలర్లు. అంటే సుమారు 52 లక్షల కోట్ల రూపాయలతో సమానం.
ఇక తాజాగా ట్విటర్‌ను కూడా సొంతం చేసుకున్న మస్క్ భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలకు తెర దించుతాడోనని సర్వత్రా చర్చసాగుతోంది.