Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

Updated on: Jul 22, 2026 | 1:39 PM

డీమార్ట్ తమ ఉద్యోగులకు అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. కేవలం జీతంనే కాకుండా చట్టబద్దంగా ఉద్యోగులకు కల్పించాల్సిన అన్నీ ప్రయోజనాలు అందిస్తోంది. బోనస్, ప్రమోషన్లు కూడా అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో.. ఆ బెనిఫిట్స్ అన్నీ ఉద్యోగికి అందిస్తోంది. ఆ వివరాలు చూస్తే..

1 / 5
డీమార్ట్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ హోల్‌సేల్ ధరలకే లభిస్తుంది. కిరాణా దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు.. ఇలా ప్రతీది ఇక్కడ దొరుకుతుంది. ఒక్కొ షాప్ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క డీమార్ట్‌కు వెళితే చాలు అన్నీ వస్తువులు ఒకేచోట తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇంట్లోకి ఏదైనా అవసరమైతే చాలు.. వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడుతుంటారు.

2 / 5
డీమార్ట్‌లో తక్కువ ధరలకే వస్తువులు దొరుకుతాయనే విషయం పక్కన పెడితే.. అందులో పనిచేసే ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది.. వారికి పీఎఫ్, హెల్త్ ఇన్యూరెన్స్, గ్రాట్యూటీ, బోనస్, ప్రమోషన్స్ లాంటి ప్రయోజనాలు ఉంటాయా.. అనే విషయాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటికి సమాధానం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

3 / 5
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఉండే అన్నీ బెనిఫిట్స్ డీమార్ట్ ఉద్యోగులకు కూడా ఉన్నాయి. కేవలం జీతంనే కాకుండా తమ ఉద్యోగులకు డీమార్ట్ యాజమాన్యం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ సౌకర్యం కల్పిస్తోంది. అలాగే గ్రాట్యూటీ కూడా అందిస్తోంది. కంపెనీలో ఐదేళ్లు పనిచేసి ఉంటే ఉద్యోగం మానేశాక గ్రాట్యూటీ అందిస్తారు. ఈ రెండు బెనిఫిట్స్ వల్ల ఉద్యోగం మానేశాక చేతికి నిధులు అందుతాయి.

4 / 5
ఇక ప్రతీ సంవత్సరం తమ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా డీమార్ట్ బోనస్ ఇస్తోంది. అలాగే హెల్త్ ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఉద్యోగితో పాటు వారి కుటుంబానికి కూడా అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. ఇక వారు డీమార్ట్‌లో షాపింగ్ చేస్తే భారీ తగ్గింపు అందిస్తారు. దీని వల్ల నెలవారీ ఇంటి ఖర్చులు తగ్గుతాయి.

5 / 5
డీమార్ట్ ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి. సేల్స్ అసోసియేట్‌గా కెరీర్ ప్రారంభిస్తే.. స్టోర్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. బయట ఉద్యోగులను నియమించుకోవడం కంటే స్టోర్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డీమార్ట్ శిక్షణ అందిస్తోంది. కెరీర్‌లో ఎదగాలనుకునే ఉద్యోగులకు ఇది సహాయపడుతుంది. సాధారణ సేల్స్‌మెన్ జీతం రూ.15 వేలు ఉంటుంది.

Follow Us