Credit Card: క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్, రివార్డులపై ట్యాక్స్ ఉంటుందా..?

Updated on: Apr 23, 2026 | 10:26 PM

ఇటీవల ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. సామాన్యులు కూడా వీటిని వాడుతన్నారు. అయితే క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్స్, రివార్డులు లాంటివి చాలానే ఉంటాయి. వీటిపై పన్ను ఉంటుందా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే ట్యాక్స్ నిపుణులు ఏం చెబుతున్నారనేది ఇందులో చూద్దాం.

1 / 5
అయితే ఈ ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్‌లో చూపించాల్సిన అవసరం అనేది ఉండదు. అయితే ట్యాక్స్ నోటీసులు అనేవి రాకుండా ఉండాలంటే వెల్లడించడం ఉత్తమ మార్గం అని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. రివార్డులు, క్యాష్ బ్యాక్ భారీగా ఉన్నప్పుడు మాత్రమే పొందుర్చాలి.

2 / 5
అయితే వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే పర్సనల్ క్రెడిట్ కార్డులపై భారీ క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు వచ్చినప్పుడు దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. దీంతో రివార్డ్ పాయింట్లు, గిఫ్ట్స్ వోచర్లు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితే దీనిని ఆదాయంగా పరిగణిస్తారు. రివార్డ్ పాయింట్లను క్యాష్ రూపంలోకి మార్చుకుంటే అది ఆదాయంగా మారుతుంది.

3 / 5
అయితే క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే డిస్కౌంట్స్‌పై ట్యాక్స్‌లు కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. మీరు ఏదైనా వస్తువును రూ.వెయ్యి పెట్టి కొనుగోలు చేసినప్పుడు క్యాష్‌బ్యాక్ కింద రూ.50 తగ్గిందనుకుందాం. అంటే మీకు సదరు ప్రొడక్ట్ రూ.950కి వచ్చినట్లు లెక్క. ఈ రూ.50ను మీకు వచ్చిన ఆదాయంగా పరిగణించరు. వస్తువు ధర రూ.950కి తగ్గినట్లు భావిస్తారు. దీని వల్ల క్యాష్ బ్యాక్‌పై ట్యాక్సులు ఉండవు.

4 / 5
అయితే క్రెడిట్ కార్డులు వాడేవారికి రివార్డులు, క్యాష్ బ్యాక్స్ లాంటివి బ్యాంకింగ్ సంస్థలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ రివార్డులు, క్యాష్ బ్యాక్‌లపై ట్యాక్సులు విధిస్తారా..? ఐటీ రిటర్న్స్‌లో వీటిని పొందుపర్చాలా? ఐటీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ఐటీ ఎక్స్‌పర్ట్స్ దీనిపై ఏం చెబుతున్నారు? అనేది ఈ స్టోరీలో చూద్దాం.

5 / 5
దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతీఒక్కరి చేతుల్లో ఏదొక కార్డు తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా డెబిట్ కార్డు జారీ చేస్తున్నారు. ఇక ఇటీవల క్రెడిట్ కార్డులను ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా సామాన్యులు కూడా వాడుతున్నారు. దీంతో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం అనేది గతంలో కంటే భారీగా పెరిగింది

Follow Us