Hero MotoCorp: హీరో కంపెనీ సంచలన నిర్ణయం.. టూవీలర్ల తయారీ నిలిపివేత…! ఎందుకో తెలుసా..?

|

Apr 21, 2021 | 4:09 PM

Hero MotoCorp: దేశంలో కోవిడ్‌ తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాది తీవ్ర స్థాయిలో విజృంభించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా, మూతపడిన వివిధ రంగాలు ...

1 / 4
Hero MotoCorp: దేశంలో కోవిడ్‌ తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాది తీవ్ర స్థాయిలో విజృంభించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా, మూతపడిన వివిధ రంగాలు తెరుచుకున్నాయి. మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు కావడంతో తీవ్ర స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పలు రంగాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2 / 4
ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ ప్లాంట్లలోనూ వాహన తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్‌  కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

3 / 4
ఏప్రిల్‌ 22 నుంచి మే 1వ తేదీ వరకు ప్రతి ప్లాంట్‌ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇలా ప్లాంట్‌ నిలిపివేత సమయంలో మెయింటెనెన్స్‌ పనులు పూర్తి చేసుకుంటామని తెలిపింది. ఇకపోతే కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్‌ ఆఫీసులు మూసే ఉన్నాయి. ఉద్యుగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు.

4 / 4
కంపెనీ వాహన తయారీ నిలుపుదల కారణంగా డిమాండ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని హీరో కంపెనీ తెలిపింది. షట్‌డౌన్‌ తర్వాత ప్రతి ప్లాంట్‌లోనూ తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతాయని వెల్లడించింది.