
మారుతి సుజుకి బ్రెజ్జా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో పని చేస్తుంది. మారుతి సుజుకి బ్రెజ్జా మీకు అవసరమైన అన్ని ఫీచర్లతో వస్తుంది. అలాగే భారతీయ ప్రజలకు మరింత ఆకర్షణీయమైన, సరసమైన, దీర్ఘకాలం ఉండే బ్రెజ్జా ప్రారంభ ధర రూ. 8.34 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి టొయోటా గ్లాంజా ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ కారు 1.2 ఎల్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా పని చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో వస్తుంది. అలాగే ఈ కారులో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంటుంది. గ్లాంజా అధునాతన ఫీచర్లతో మంచి డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ఈ కారు ధర రూ. 6.86 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఇది బహుళ ఇంజన్, ట్రాన్స్ మిషన్ ఎంపికలతో వస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆధారంగా పని చేస్తుంది. ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ఈ కారు శక్తి, టార్క్‌కు మారుపేరుగా నిలిచింది. హ్యూందాయ్ వెన్యూ డీజిల్ ప్రారంభ ధర రూ. 10.70 లక్షలుగా ఉంది.

హెూండా సిటీ ఐ-వీ టెక్ఇంజిన్ ద్వారా పని చేస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీకు అనుసంధానంగా పని చేస్తుంది. ఈ సెగ్మెంట్లోని అత్యంత సౌకర్యవంతమైన, అత్యుత్తమ హ్యాండ్లింగ్ కార్లలో సిటీ కూడా ఒకటి. హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హెూండా ఎలివేట్ గతేడాది ప్రారంభించారు. ఈ ఎస్‌యూవీలో అధునాతన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆదారంగా పని చేస్తుంది. 1.5 ఎల్ ఐ-వీటీఈసీ పెట్రోల్ ఇంజన్‌తో పని చేస్తుంది. హెూండా ఎలివేట్ ప్రారంభ ధర రూ. 11.57 లక్షలు (ఎక్స్-షోరూమ్).