
బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం పడుతుందనేది తెలియదు. రోజువారీ లావాదేవీల కోసం బ్యాంకులతో రోజూ పని ఉంటుంది. దీంతో బ్యాంకు సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.

ఆగస్ట్ 16న ఆదివారం రావడంతో రేపు కూడా బ్యాంకులు ఉండవు. దీంతో వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడుతున్నాయి. అయితే వచ్చే వారంలో కూడా బ్యాంక్ సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో మూడపడతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ముందే జాగ్రత్త పడవచ్చు.

ఆగస్ట్ 19న మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినోత్సవం సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్టు 25వ తేదీ మంగళవారం మిలాద్-ఉన్-నబీ / మొదటి ఓనం / మిలాద్-ఇ-షరీఫ్ సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు దీనిని గమనించాలి.

ఇక ఆగస్టు 26న ఈద్-ఎ-మిలాద్/బరవాఫత్/మిలాద్-ఉన్-నబీ (ప్రవక్త మహమ్మద్ జన్మదినం)/తిరువోణం పండుగల సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి.

ఆగస్ట్ 28న అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్టక్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో రక్షా బంధన్ / పాంగ్-లబ్సోల్ / శుక్రవారం ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబ్బి తర్వాత నారాయణ జయంతి / నారాయణ జయంతి సందర్భంగా మూసివేయబడతాయి. ఇక వీటితో పాటు ఆగస్ట్ 22న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.