
ఫైర్ బోల్ట్ ఫోనిక్స్.. 240x240 పిక్సెల్ రిజల్యూషన్, 260 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.3 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఫుల్-టచ్ డిస్‌ప్లేతో ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ స్మార్ట్‌వాచ్ ఆకట్టుకుంటోంది. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం బ్లూటూత్ కాలింగ్ లేకుండా ఏడు రోజులు, కాలింగ్ చేసుకుంటే నాలుగు రోజులు ఉంటుంది. 120+ స్పోర్ట్స్ మోడ్‌లతో ఫిట్‌నెస్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్, హెచ్ డీ కాలింగ్ అదనపు ప్రత్యేకతలు. ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,599.

క్రాస్‌బీట్స్ ఆర్మర్.. 1.43 అంగుళాల అమెలెడ్ డిస్ ప్లే, వాటర్ ఫ్రూప్ టెక్నాలజీ, 410ఏంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఈ వాచ్ ప్రత్యేకతలు. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 15 రోజుల పాటు పనిచేస్తుంది. బ్లూటూత్‌కి సులభంగా కనెక్ట్ చేయవచ్చు, అమెజాన్ లో 67 శాతం తగ్గింపుతో రూ.3,999కు క్రాస్‌బీట్స్ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది.

ఫాస్ట్ ట్రాక్ డిజైర్.. ఏఐ వాయిస్ అసిస్టెంట్, అంతర్నిర్మిత గేమ్‌లు, ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ దీని ప్రత్యేకతలు. 240x240 పిక్సెల్ రిజల్యూషన్, 1.38 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, సింగిల్ సింక్ బీటీ కాలింగ్ అదనపు ప్రత్యేకతలు. దీని ద్వారా హృదయ స్పందన, ఒత్తిడిని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ డిజైర్ ఎఫ్ఎక్స్ వన్ వాచ్ రూ.2,499కు అందుబాటులో ఉంది.

బోట్ లూనార్ ఆర్బ్.. బోట్ లూనార్ ఆర్బ్ వాచ్ లో 1.45 అంగుళాల అమెలెడ్ డిస్ ప్లే, బీటీ కాలింగ్ కాలింగ్, ప్రీమియం బిల్ట్-ఇన్ స్పీకర్, 700+ యాక్టివ్ మోడ్‌లు, మైక్రోఫోన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆరోగ్య ఫిట్‌నెస్ ట్రాకర్, ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ స్పోర్ట్స్ స్కోర్ వివరాలను తెలుసుకోనే వీలుకూడా ఉంది. అమెజాన్ లో దీనిపై 79 శాతం తగ్గింపు ఇస్తున్నారు. కేవలం రూ.1,899తో ఈ వాచ్ ను కొనుగోలు చేసుకోవచ్చు.

కలర్ ఫిట్ పల్స్ 3.. నాయిస్ నుంచి విడుదలైన కలర్ ఫిట్ పల్స్ 3 స్మార్ట్ వాచ్ పై 79 శాతం డిస్కౌంట్ ఉంది. 1.96 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, ఏడు రోజుల బ్యాటరీ ఛార్జింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ట్రూసింక్ టీఎం ద్వారా అధునాతన బ్లూటూత్ కాలింగ్ అదనపు ఆకర్షణ. అమెజాన్ లో ఈ స్మార్ట్ వాచ్ రూ.1,499కు అందుబాటులో ఉంది.