Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి బిగ్ న్యూస్.. ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆ తర్వాత ఛార్జీలు కట్టాల్సిందే..

Updated on: Sep 24, 2026 | 4:28 PM

పిల్లల తల్లిదండ్రులకు యూఐడీఏఐ బిగ్ అలర్ట్ జారీ చేసింది. చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేయించాలని తెలిపింది. ఈ మేరకు ఉచితంగా అప్డేట్ చేయించేందుకు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత సేవా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

1 / 5
చిన్నారుల ఆధార్ కార్డులకు సంబంధించి యూఐడీఏఐ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. పిల్లల ఆధార్ గుర్తింపును సురక్షితంగా, తాజాగా ఉంచడానికి 5, 15 సంవత్సరాల వయస్సులో పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేసుకోవడాన్ని యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డులను అప్డేట్ చేయించవచ్చు.

2 / 5
అయితే సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉచితంగా పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత నిర్ణీత రుసుంలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ను ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ సూచించింది.

3 / 5
పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేసేందుకు దేశవ్యాప్తంగా యూఐడీఏఐ ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. స్కూల్స్ ,కాలేజీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. ఆగస్ట్ 18 నాటికి దేశవ్యాప్తంగా 1.56 లక్షల స్కూల్స్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా..2 కోట్లమందికిపైగా పిల్లలు ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకున్నారు. పిల్లలు పెద్దయ్యే కొద్ది శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో వేలిముద్రలు, ఐరిస్ వంటివి మారతాయి.

4 / 5
పిల్లలకు బాల ఆధార్ జారీ చేస్తారు. కేవలం పేరు, పొటో, అడ్రస్ మాత్రమే అందులో ఉంటుంది. బయోమెట్రిక్స్ తీసుకోరు. పిల్లలకు ఐదు సంవత్సరాల వచ్చాక బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 15 సంవత్సరాలు వచ్చాక మరోసారి అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. దీని వల్ల ఆధార్ ధృవీకరణ సమస్యలు తగ్గుతాయి.

5 / 5
అక్టోబర్ 1,2025 నుంచి ఐదు నుంచి 17  సంవత్సరాల వయస్సువారికి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 30తో ఆ గడువు ముగియనుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి తీసుకెళ్లి అప్డేట్ చేయించాలి. అలాగే స్కూళ్లల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాల్లె కూడా అప్డేట్ చేయించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us