
ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి గిన్నెలు మొత్తం మాడిపోతాయి అలాంటి సమయంలో వాటిని పోగొట్టడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. మీకు ఖర్చు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మాడిన గిన్నెలు మొత్తం తలా తలా మెరిసిపోతాయి. మరి, అస్సలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం..

మాడిన పాత్రను మళ్ళీ తెల్లగా చేయడానికి బేకింగ్ సోడా, నిమ్మరసం బెటర్. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, మూడు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఇంకా దీనిలో రెండు కప్పుల వేడినీటిని కలిపి మసిగా అయినా చోట వీటిని పోయాలి. మీరు దీనిని పోసిన తరవాత కొంతసేపు అలాగే పక్కన పెడితే పై పొర మెత్తగా అవుతుంది.

వీటితో పాటు మీ పెరట్లో దొరికిన కూరగాయలు కూడా మంచిగా ఉపయోగపడతాయి. వాటిలో టమాటా కూడా ఒకటి. మీరు దీనిని రసంలాగా తీసుకుని మాడిన పాత్రపై వేసి రుద్దితే మసి మొత్తం పోతోంది. ఇంకా మాడిన చోట టమాటా ముక్కలు ఉంచి పక్కన పెడితే అది కొంత సేపటికి మొత్తం ఊడి వస్తుంది దీనిని పక్కా ట్రై చేయండి

ప్రతి అందరి ఇళ్లలో బంగాళాదుంపలు ఉండే ఉంటాయి మీరు ఆ తొక్కలను కూడా చెత్తలో పడేయకుండా నీటిలో వాటిని బాగా మరిగించాలి. ఆ తొక్కల్లో ఉండే పిండి పదార్థాలు మాడిన మసిని పోగొట్టడంలో హెల్ప్ చేస్తాయి. వేడి అయిన నీటిని తొలగించి , పాత్ర చల్లారిన తర్వాత మంచిగా క్లీన్ చేస్తే మసి మొత్తం పోతోంది.

ఇంకా చెప్పాలంటే రాగి, ఇత్తడి పాత్రలు మెరుపు పోతూ ఉంటుంది. ఎందుకంటే, ఇవి కొంచం మాడిన అది అంత తొందరగా పోదు. మీరు దీని కోసం ఏం అవసరం లేదు నిమ్మకాయ, ఉప్పు వాడితే మంచిది. ముందుగా నిమ్మకాయను రెండు ముక్కాలుగా చేసి దాని మీద కొంచం ఉప్పు వేసి దానిని రుద్దాలి ఇలా చేస్తే తలా తలా మెరిసిపోతాయి