ఆంధ్రా స్టైల్ వంకాయ బొమ్మిడాయిల పులుసు.. తింటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాలసిందే

Updated on: Apr 14, 2026 | 5:03 PM

Brinjal bommidala pulusu recipe in Telugu: వంకాయ బొమ్మిడాల పులుసును ఆంధ్రాలో చాలా ఇష్టంగా తింటారు, ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే వారంలో రెండు సార్లు తింటారు. ఇది అంత రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలంటే?

1 / 5
కావాల్సిన పదార్దాలు : పావు కిలో బొమ్మిడాయి చేపల ముక్కలు, 3 వంకాయలు,  ఒక కప్పు చింతపండు రసం,  ఒక ఉల్లిపాయ  పెద్దది,  మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  రెండు టేబుల్ స్పూన్లు కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, 
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : పావు కిలో బొమ్మిడాయి చేపల ముక్కలు, 3 వంకాయలు, ఒక కప్పు చింతపండు రసం, ఒక ఉల్లిపాయ పెద్దది, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
ముందుగా బొమ్మిడాయిలను తీసుకుని ఒకసారి ఉప్పు, ఇంకోసారి నిమ్మరసంతో బాగా కడిగి  గిన్నెలో  పెట్టుకోవాలి.
 పాన్ లో ఆయిల్  చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే వేయించాలి.

ముందుగా బొమ్మిడాయిలను తీసుకుని ఒకసారి ఉప్పు, ఇంకోసారి నిమ్మరసంతో బాగా కడిగి గిన్నెలో పెట్టుకోవాలి. పాన్ లో ఆయిల్ చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే వేయించాలి.

3 / 5
 ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలను దానిలో వేసి 5 నిముషాల పాటు బాగా ఉడకనివ్వాలి.ఆ తర్వాత కొద్దిగా పసుపు,  ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలను దానిలో వేసి 5 నిముషాల పాటు బాగా ఉడకనివ్వాలి.ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.

4 / 5
ఒక కప్పు చింతపండు రసం, కొద్దిగా నీళ్లు పోసి ఆ పులుసును ఉడికే ఉంచాలి. ముందుగా క్లీన్  చేసిన బొమ్మిడాయిలను పులుసులో  వేసుకోవాలి.

ఒక కప్పు చింతపండు రసం, కొద్దిగా నీళ్లు పోసి ఆ పులుసును ఉడికే ఉంచాలి. ముందుగా క్లీన్ చేసిన బొమ్మిడాయిలను పులుసులో వేసుకోవాలి.

5 / 5
Brinఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి.  ఇదే సమయంలో గరిటె అస్సలు పెట్టకూడదు. పెడితే ముక్కలు చెదిరిపోతాయి. చివర్లో  కొత్తిమీరను వేసి కిందకు దించేయాలి.

Brinఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇదే సమయంలో గరిటె అస్సలు పెట్టకూడదు. పెడితే ముక్కలు చెదిరిపోతాయి. చివర్లో కొత్తిమీరను వేసి కిందకు దించేయాలి.

Follow Us