బోనాల స్పెషల్.. పొట్టేల్ కర్రీ త్వరగా ఉడికి, రుచిగా ఉండాలా? ఇలా చేయండి!

Updated on: Jul 18, 2026 | 5:37 PM

భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైంది. పోతరాజులు, శివ సత్తుల ఆట పాటలతో నగరం మార్మోగిపోతుంది. అయితే సమయంలో చాలా మంది అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి యాట పిల్లలను బలి ఇస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం బోనాల సందర్భంగా పొట్టేల్ కర్రీ త్వరగా ఉడకడమే కాకుండా రుచిగా ఉండాలి అంటే ఏం చేయాలో చూసేద్దాం.

1 / 5
బోనాల పండుగ సందర్భంగా చాలా మంది పొట్టేల్ కర్రీ వండుతుంటారు. అయితే చాలా వరకు దీని కర్రీ చాలా లేటుగా ఉడుకుతుంది. అంటారు. అందువలన మీరు పొట్టేలు కొనుగోలు చేసే సమయంలోనే చాలా లేత పిల్లను కొనుగోలు చేయాలి. దీని వలన మాంసం త్వరగా ఉడకడమే కాకుండా, రుచికూడా చాలా అద్భుతంగా ఉంటుందంట.

2 / 5
అంతే కాకుండా పొట్టేలు కోసిన తర్వాత మాసం తీసి, దానిని శుభ్రంగా కడిగి, అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నూనె అన్నీ వేసి బాగా కలిపి దాదాపు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలంట. దీని వలన మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఇలా పొట్టేలు మాంసం వండుకోవడం వలన రుచి బాగుంటుందంట.

3 / 5
ఇక పొట్టేలు కర్రీ వండటానికి పచ్చి మిర్చి, ఆనియన్, బిర్యానీ ఆకు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, కొత్తిమీర, పూదీనా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా ఇవన్నీ కూడా తీసుకోవాలి. ముందుగా మటన్‌ను కుక్కర్‌లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

4 / 5
 తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో సరిపడ నూనె వేయాలి. అందులో ఉల్లిపాయలు తరిగినవి, పచ్చి మిర్చీ, బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఉడికిన మటన్ అందులో వేసి మంచిగా కలిపి , మూత పెట్టాలి. దాదాపు 15 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి.

5 / 5
తర్వాత అందులో కారం, ఉప్పు, గరం మాసాల, పచ్చి,  వేయించిన ధనియాల పొడి, మటన్ మసాలా  అన్నీ వేసి మరో రెండు నిమిషాలు కలిపి, దాదాపు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పూదీనా వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పొట్టేలు కర్రీ రెడీ.

Follow Us