
రోహిణి కార్తె తరవాత ఎండలు విపరీతంగా ఎక్కువయ్యాయి. ఈ టైం లో ఒంటికి చలువ చేసే ఫుడ్స్ తీసుకోవాలి అలాంటి వాటిలో ఈ బొబ్బర్లు వడలు బెస్ట్. ఇది ఒకసారి చేసుకుని తింటే అస్సలు వదిలిపెట్టరు. మరి, అస్సలు లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బొబ్బర్లు, ఒక ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు ఆకులు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి అలాగే ఈ బొబ్బర్ల వడలను ఎర్రగా కాల్చుకోవడానికి సరిపోను నూనెను తీసుకోవాలి.

బొబ్బర్లు వడల తయారీ విధానం : ముందుగా బొబ్బర్లను నానబెట్టుకోవాలి వీటిని తీసుకుని కనీసం 10 గంటల పాటు మంచి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నానిన బొబ్బర్లను తీసుకుని రోటిలో లేదా గ్రైండ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని మరి నీలి నీలిగా చెయ్యకండి. ఇంకా వీటిలో కొద్దిగా నీరు పోసి ఇంకోసారి కూడా రెండో సారి కూడా మిక్సీ పట్టుకోండి..

ఈ మిశ్రమంలో ఇవి కలపాలి : ఈ పేస్ట్ మిశ్రమం తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, రెండు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే ఈ వడలు మంచిగా వస్తాయి కర కర లాడుతూ మంచిగా ఉంటాయి.

ఈ బొబ్బర్లు వడలు అంటే పడని వారు వీటిని తినకపోవడమే మంచిది (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)