Subhash Goud |
Mar 25, 2022 | 9:04 PM
BMW Car: ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే వివిధ వాహన కంపెనీలు కూడా ధరలను పెంచేశాయి. ఇక కొత్తగా కారు గొనుగోలు చేసేవారికి షాకిచ్చింది లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW). ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని మోడళ్ల కార్లపై 3.5 శాతం పెంచనున్నట్లు శుక్రవారం కంపెనీ వెల్లడించింది.
మెటీరియల్, లాజిస్టిక్స్ ధరలు, ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావం, మారకం రేట్ల ప్రభావం కారణంగా ధరలను పెంచాల్సిన వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక బీఎండబ్ల్యూ గ్రూప్స్‌కు చెందిన 100 శాతం సబ్సిడరీ అయిన బీఎండబ్ల్యూ భారత్ ప్రధాన కార్యాలయంలో గురుగ్రామ్‌లో ఉంది
పెరుగుతున్న ముడి సరుకుల ధరల కారణంగా ఆయా కార్ల తయారీ కంపెనీలు వివిధ రకాల మోడళ్లపై ధరలను పెంచేస్తున్నాయి. బీఎండబ్ల్యూ కూడా అదే బాటలో పయనిస్తోంది.