డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ రిచ్ ఫుడ్..

Updated on: Nov 27, 2026 | 12:07 PM

మన శరీరంలో రక్తనాళాలు రక్తప్రసరణకు ఎంత ముఖ్యమో, నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుండి అవయవాలకు, అవయవాల నుండి మెదడుకు సమాచారాన్ని మోసుకెళ్లే నరాలు ఆరోగ్యంగా ఉండటం మొత్తం శరీర పనితీరుకు అవసరం. అయితే, వయసు పెరిగే కొద్దీ, లేదా డయాబెటిస్ వంటి సమస్యల కారణంగా నరాలు బలహీనపడటం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వణుకు, మంటలు, చురుకులు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది

1 / 5

మన శరీరంలో రక్తనాళాలు రక్తప్రసరణకు ఎంత ముఖ్యమో, నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుండి అవయవాలకు, అవయవాల నుండి మెదడుకు సమాచారాన్ని మోసుకెళ్లే నరాలు ఆరోగ్యంగా ఉండటం మొత్తం శరీర పనితీరుకు అవసరం. అయితే, వయసు పెరిగే కొద్దీ, లేదా డయాబెటిస్ వంటి సమస్యల కారణంగా నరాలు బలహీనపడటం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వణుకు, మంటలు, చురుకులు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ నరాల బలహీనతను తగ్గించి, వాటిని బలంగా మార్చడానికి వేరుశెనగపప్పులు మంచిగా ఆహారంగా చెబుతున్నారు.

2 / 5
పల్లీలలో బి విటమిన్లు, బి3 (నియాసిన్) అధికంగా ఉంటాయి. నరాల ఆరోగ్యానికి ఇది అత్యవసరమైన విటమిన్. సగటున ఒక వ్యక్తికి రోజుకు 14 నుండి 23 మిల్లీగ్రాముల నియాసిన్ అవసరం. 100 గ్రాముల పల్లీలలో సుమారు 11 మిల్లీగ్రాముల నియాసిన్ ఉంటుంది, ఇది రోజువారీ అవసరంలో 80 శాతానికి పైగా తీరుస్తుంది. పాలిష్ పట్టిన బియ్యం, రవ్వలలో బి విటమిన్లు తక్కువగా ఉంటాయి, కానీ ధాన్యాలు, వి త్తనాలలో ఇవి పుష్కలంగా దొరుకుతాయి.

3 / 5
 నియాసిన్ నరాల సిగ్నల్ ట్రాన్స్‌మిషన్ ప్రక్రియకు అత్యవసరం. ఇది మెదడు నుండి అవయవాలకు, అవయవాల నుండి మెదడుకు సమాచారం వేగంగా, సమర్థవంతంగా చేరవేయడానికి అవసరమైన ఎంజైమ్‌లు, రసాయనాలు ఉత్పత్తి కావడానికి బి3 విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, నరాల కణాలు వైరస్, బ్యాక్టీరియాల దాడికి గురై ఇన్ఫ్లమేషన్‌కు లోనైనప్పుడు, వాటిని రిపేర్ చేసి, చనిపోకుండా కాపాడటానికి కూడా బి3 విటమిన్ సహాయపడుతుంది.

4 / 5
పల్లీలలో 45-50 శాతం కొవ్వు ఉంటుంది, అందులో ఎక్కువ భాగం మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ కొవ్వులు నియాసిన్‌తో కలిసి నరాల పైన ఉండే మైలిన్ షీత్ అనే రక్షణ కవచం ఆరోగ్యంగా ఉండటానికి, తయారవడానికి సహాయపడతాయి. మైలిన్ షీత్ అనేది విద్యుత్ తీగలపై ఉండే రబ్బరు కోటింగ్ లాంటిది, ఇది నరాలను రక్షిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తప్రసరణ తగ్గిపోయి, ఈ మైలిన్ షీత్ దెబ్బతినడం వల్ల మంటలు పుడతాయి. పల్లీలతో మైలిన్ షీత్‌ను తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవచ్చు, ఆ తరవాత నరాల డ్యామేజ్ నుండి రక్షణ పొందవచ్చు.

5 / 5
100 గ్రాముల పల్లీలలో సుమారు 197 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం నరాల కణాలకు రిలాక్సేషన్ అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పగలంతా మనం చేసే ఆలోచనలు, పనుల వల్ల నరాలు అలసిపోతాయి. ఈ అలసట నుండి అవి కోలుకొని, మరుసటి రోజు సమర్థవంతంగా పనిచేయాలంటే విశ్రాంతి అవసరం. మెగ్నీషియం ఈ విశ్రాంతిని అందించడం వలన  నరాల కణాల జీవితకాలాన్ని పెంచుతుంది, వృద్ధాప్యంలో కూడా నరాలు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us