Health Tips: తులసితో ఆరోగ్యమే కాదు.. అంతకు మించిన అద్భుత ప్రయోజనాలున్నాయి.. అవేంటంటే..

|

Oct 16, 2022 | 1:40 PM

తులసిలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాల వ్యక్తి చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో ఉండే హీలింగ్ గుణాలు చర్మ గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

1 / 5
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను తినడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే తులసితో జలుబు, దగ్గు తగ్గడమే కాకుండా.. చర్మానికి అద్భుతంగా ఉపయోగపడుతంది. తులసిలో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మానికి తులసి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

2 / 5
అందమైన ముఖవర్చస్సు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ముఖారవిందాన్ని పెంచుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటే.. ఇంకొందరు ఇంట్లో చిట్కాలు పాటిస్తూ ఏవేవో చేస్తుంటారు. అయితే, ఒక పరిశోధన ప్రకారం.. తులసి ఆకుల్లో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. మీ చర్మం మెరవాలంటే.. తులసిని ఉపయోగించవచ్చు. తులసి ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తద్వారా చర్మం కూడా మెరుపు వస్తుంది.

3 / 5
తులసి ఆకులను, ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయి. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. తులసి యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని కారణంగా తులసి అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో పని చేస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

4 / 5
చర్మ వ్యాధుల నివారణ: తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మ వ్యాధుల నివారణలో అద్భుత ప్రవాహాన్ని చూపుతాయి. గాయాలను త్వరగా మాన్పిస్తుంది. చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పని చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా తీవ్రమైన చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

5 / 5
ముఖంపై మొటిమలు, వేడి కురుపులతో బాధపడుతున్నట్లయితే.. తులసిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. తులసి ఆకుల నుంచి తీసిన పసరు యాంటీబాక్టీరియల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని మొటిమలపై రుద్దితే మొటిమలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీఇన్‌ఫ్టమేటరీ ప్రభావాన్ని చూపుతుంది.