
ప్రస్తుత కాలంలో అందంగా ఉండటాన్నే ఆత్మ స్థైర్యంగా ఫీల్ అవుతున్నారు. అందానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందంగా ఉంటేనే ఏదన్నా సాధించగలం అనుకుంటున్నారు. ఈ మేరకు అందంగా మారడం కోసం అనేక వాటిని ఫాలో చేస్తున్నారు.

అందం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు. మరి అందంగా ఉండటం కోసం మంచి బ్యూటీ టిప్స్ మీకోసం. ఇవి అబ్బాయిలకు కూడా చక్కగా పని చేస్తాయి.

మనం ఇంట్లో తరచుగా ఉపయోగించే నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి.

బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి.. మంచి గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. ఫేస్ తాజాగా కనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ రాసినా ముఖానికి మంచి గ్లో వస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా పసుపు కలిపి.. ముఖానికి పట్టిస్తే.. మురికి అంతా పోతుంది.

చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది. ఆలు గడ్డల రసం, టమాటా రసం, ఓట్స్ పొడి పాలు.. వంటి ఈ స్క్రబ్‌లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)