ఆధునిక ప్రపంచంలో ప్రజల అలవాట్లు అన్ని మారుతున్నాయి. దీంతో పలువురు సరైన జీవనశైలిని అవలంభించకపోవడం, అనారోగ్య ఆహారాలను తీసుకోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి చాలా మంది ఇప్పుడు డిటాక్స్ పానీయాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న బార్లీ నీరు కూడా టాప్ స్థాయిలో ఉంది.. బార్లీతో చేసిన నీరు ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉండటంతోపాటు శరీరంలో వేడి స్వభావాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
భారతదేశంలో బార్లీ ఉద్యమం కొత్తది కాదు. కానీ ఈ ధాన్యాన్ని ఉపయోగించి డిటాక్స్ వాటర్ తయారు చేసే విధానం కాస్త ఆధునికమైనది. కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెంచా బార్లీని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, నీటిని 30 నిమిషాలు మరిగించి, ఆపై త్రాగాలి.
బార్లీ నీరు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. రెగ్యులర్ గా గ్యాస్-హార్ట్ బర్న్ సమస్యలతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని తాగాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మంచి జీర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బార్లీ నీటిని తాగడం ద్వారా, మీరు ఈ సమస్యను నివారించవచ్చు. అంతేకాదు వేడి వాతావరణంలో కూడా శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఈ డిటాక్స్ డ్రింక్ సహకరిస్తుంది.
బార్లీ వాటర్ తాగడం వల్ల శరీరంలోని అన్ని కాలుష్య కారకాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు కూడా ఎలాంటి కాలుష్య కారకాలు పేరుకుపోవడానికి అనుమతించవు. ఇది కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బార్లీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి.
బరువు తగ్గేందుకు ఉదయం, మధ్యాహ్నం జిమ్‌కి వెళ్లేవారు బార్లీ వాటర్‌ను రెగ్యులర్‌గా తాగవచ్చు. బార్లీ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను గ్రహిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీంతో బార్లీతో చేసిన ఖిచిడీని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు.
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పటికీ బార్లీ నీటిని తాగవచ్చు. బార్లీ నీరు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దానితో పాటు మీరు ఉపయోగించే ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
బార్లీలో ఫైబర్ ఉన్నందున, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంటే మధుమేహం సమస్యతో బాధపడేవారు బార్లీ వాటర్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా, బార్లీ గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
అంతేకాకుండా బార్లీ నీరు మూత్ర సమస్యలను కూడా దూరం చేస్తాయి. అందుకే వైద్యనిపుణులు బార్లీ నీటిని తాగాలని సూచిస్తున్నారు.