
కావాల్సిన పదార్థాలు : బాలామృతం రెండు కప్పులు, టూ స్పూన్స్ గోధుమ పిండి, కొబ్బరి తురుము, బేకింగ్ సోడా, నెయ్యి రెండు టీ స్పూన్స్, పాలు అరలీటర్,బాదం , జీడిపప్పు, ఉప్పు చిటికెడు.

తయారీ విధానం : ముందుగా బాలామృతం తీసుకొని అందులో రెండు స్పూన్స్ గోధుమ పిండి , కొబ్బరి తురుము, నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి, అందులో బాదం, జీడిపప్పులు వేసి, చిటికెడు ఉప్పు వేసి, బేకింగ్ సోడా, కొద్ది కొద్దిగా పాలు పోస్తూ మిక్సీ పట్టుకోవాలి.

తర్వాత మిశ్రమం మరీ గట్టిగా కాకుండా, బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి వీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ బిస్కెట్స్ తయార చేసుకోవాలి.

మీకు బిస్కెట్స్‌లా కనిపించడానికి, వాటిపై చిన్నగా గీతలు పెట్టండి. దీనివలన బిస్కెట్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక తర్వాత వీటిని బేక్ చేయాలి. దీని కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోండి.

స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై బౌల్ పెట్టి, అందులో కొంచెం ఉప్పు వేసి, అది వేడి అయ్యేలా చూడండి. తర్వాత అందులో స్టాండ్ పెట్టి, ఒక ప్లేట్‌లో బిస్కెట్స్ పెట్టి, బిస్కెట్స్ ఉన్న ప్లేట్ స్టాండ్ పై పెట్టి 15 నిమిషాలు బేక్ అయ్యేలా చూడాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, బేక్ అయిన బిస్కెట్స్‌ను వేరే బౌల్‌లోకి తీసుకోండి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ బిస్కెట్స్ రెడీ, వీటిని తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.