
బక్రీద్ పండుగ రోజున ఇంట్లో అందరూ తప్పకుండా చేసే తియ్యటి వంటకాలలో హైదరాబాదీ డబుల్ కా మీఠా కూడా ఒకటి. దీనిలో బ్రెడ్, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా నెయ్యి కూడా వేసి తయారు చేసుకునే తీపి వంటకం. మీరు దీనిని ఒకసారి నోట్లో వేసుకుని తింటే కరిగిపోయేంత తియ్య తియ్యగా ఉంటుంది. ఇంకా దీని వెనుక పెద్ద కథే ఉంది. హైదరాబాద్ నవాబుల కాలం నుంచి వస్తున్న ఈ ప్రత్యేక స్వీట్ ఎంతో ఫేమస్.

హైదరాబాదీ డబుల్ కా మీఠాకు కావాల్సిన పదార్థాలు: 8 బ్రెడ్ స్లైసులు, ఒక లీటర్ పాలు, ఒక కప్పు చక్కెర, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు, నాలుగు పిస్తా పప్పులు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఇంకా కొద్దిగా కుంకుమపువ్వును కూడా తీసుకోవాలి.

హైదరాబాదీ డబుల్ కా మీఠా తయారీ విధానం: ముందుగా బ్రె తెల్లటి బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటి నాలుగు అంచులను తీసేసి త్రిభుజాల్లా దీనిని మంచిగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ పాన్ లో కూడా నెయ్యి వేసి అలాగే బ్రెడ్ ముక్కలను వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు దీనిని బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు ఇంకో గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని వాటిలో మరిగించి, దానిలో చక్కెర, కొద్దిగా యాలకుల పొడి వేసి వాటిని బాగా వేయించాలి. ఇంకా ఇప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక పాత్రలో వేసి అలాగే దీనిలో పాల మిశ్రమాన్ని కూడా పోయాలి. అలాగే దీనిలో జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు కూడా సూపర్ ఉంటుంది.

ఇంకా మీరు దీనిలో నెయ్యిలో వేయించిన బ్రెడ్‌తో వేస్తె తినడానికి మంచి రుచి వస్తుంది. అలాగే దీనిలో రబ్డీ కలిపితే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిని చల్లగా తింటే ఈ స్వీట్ తియ్యగా , కమ్మగా ఉంటుంది.పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరికీ ఎంతో ఇష్టమైన రుచి వస్తుంది. అలాగే, కొద్దీ నిముషాల్లోనే ఈ స్వీట్ ను తయారుచేసుకోవచ్చు